IND vs IRE: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన ఐర్లాండ్‌ | IND vs IRE 2nd T20I Toss, Playing XIs, Updates, Highlights, Result | Sakshi
Sakshi News home page

IND vs IRE: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన ఐర్లాండ్‌

Jun 28 2026 5:33 PM | Updated on Jun 28 2026 10:45 PM

IND vs IRE 2nd T20I Toss, Playing XIs, Updates, Highlights, Result

ఐర్లాండ్‌తో రెండో టీ20లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఫలితంగా బెల్‌ఫాస్ట్‌ వేదికగా ఐరిష్‌ జట్టు మరోసారి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.  నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా... టీమిండియా లక్ష్య ఛేదనలో తేలిపోయింది. 

నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 153 పరుగులే చేసింది. ఫలితంగా ఒక్క పరుగు తేడాతో గెలుపొంది ఐర్లాండ్‌ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

******************************************
*****************************************
ఎనిమిదో వికెట్‌ డౌన్‌
17.5: హోలార్డ్‌ బౌలింగ్‌లో సూర్యాంశ్‌ (1) అవుట్‌.

ఏడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
17.2: హోలార్డ్‌ బౌలింగ్‌లో మెక్‌కార్తికి క్యాచ్‌ ఇచ్చి ఏడో వికెట్‌గా వెనుదిరిగిన తిలక్‌ వర్మ (55). విజయానికి 16 బంతుల్లో 38 పరుగులు కావాలి.

ఆరో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
16.1: హంఫ్రేస్‌ బౌలింగ్‌లో శివం దూబే (20) అవుట్‌. స్కోరు: 109-6(16.1). తిలక్‌ 48 పరుగులతో ఉన్నాడు.

15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 104-5
తిలక్‌ 46, శివం దూబే 17 పరుగులతో ఉన్నారు.

ఐదో వికెట్‌ డౌన్‌
11.3: మాథ్యూ హోలార్డ్‌ బౌలింగ్‌ టక్కర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగిన అక్షర్‌ పటేల్‌ (14). స్కోరు: 74-5(11.3)

పది ఓవర్లలో టీమిండియా స్కోరు
తిలక్‌ వర్మ 27 , అక్షర్‌ పటేల్‌ 12 పరుగులతో ఉన్నారు. విజయానికి 60 బంతుల్లో 89 పరుగులు కావాలి. 

వర్షం వల్ల ఆటకు అంతరాయం
ఎనిమిది ఓవర్ల తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. భారత్‌ విజయానికి 72 బంతుల్లో 101 పరుగులు కావాలి. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి.

ఎనిమిది ఓవర్లలో టీమిండియా స్కోరు: 54-4
అక్షర్‌ పటేల్‌ ఏడు, తిలక్‌ వర్మ 21 పరుగులతో ఉన్నారు.

పవర్‌ ప్లేలో టీమిండియా స్కోరు:41-4(6)
తిలక్‌ 14, అక్షర్‌ పటేల్‌ 1 పరుగుతో ఉన్నారు. విజయానికి 84 బంతుల్లో 114 పరుగులు కావాలి.

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
4.5: జై ముంద్రా బౌలింగ్‌లో తిలక్‌ వర్మ బంతిని ఎదుర్కోగా.. ఇషాన్‌ (12) సింగిల్‌ కోసం వెళ్లి రనౌట్‌ అయ్యాడు. స్కోరు: 35-4(4.5). తిలక్‌ వర్మ 13 పరుగులతో ఉండగా.. అక్షర్‌ పటేల్‌ క్రీజులోకి వచ్చాడు.

మూడో వికెట్‌ డౌన్‌
2.4: జై ముంద్రా బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (7 బంతుల్లో 10) బౌల్డ్‌. స్కోరు: 19-3(2.4). విజయానికి 136 పరుగులు కావాలి. తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌ (9*) క్రీజులో ఉన్నారు.

సంజూ, అభిషేక్‌ శర్మ డకౌట్‌
తొలి ఓవర్లోనే ఐర్లాండ్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌, భారత సంతతి ఆటగాడు జై ముంద్రా సంచలనం సృష్టించాడు. తొలి బంతికే సంజూను గోల్డెన్‌ డకౌట్‌గా వెనక్కి పంపిన జై.. నాలుగో బంతికి అభిషేక్‌ శర్మను డకౌట్‌ చేశాడు. భారత్‌ స్కోరు: 1-2(0.5). ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులో ఉన్నారు.

టీమిండియా టార్గెట్‌ ఎంతంటే?
ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. 

ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు
19.6: ఆఖరి బంతికి ఇషాన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటైన మెక్‌కార్తి (2)
19.4: ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన హ్యారీ టెక్టార్‌ (53).

ఆరో వికెట్‌ డౌన్‌
18.3: అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఆరో వికెట్‌గా వెనుదిరిగిన జార్జ్‌ డాక్రెల్‌ (14 బంతుల్లో 19). స్కోరు 144-6(18.4)

👉 వర్షం అంతరాయం.. నాలుగు నిమిషాల్లో మళ్లీ మొదలైన మ్యాచ్‌ (7.28 PM)

ఐదో వికెట్‌ డౌన్‌
14.5: వరుసగా రెండో వికెట్‌ తీసిన శివం దూబే. డెలానీని బౌల్డ్‌ చేసి డకౌట్‌గా వెనక్కి పంపిన దూబే. స్కోరు: 113-5(14.5). జార్జ్‌ డాక్రెల్‌ క్రీజులోకి వచ్చాడు. పదిహేను ఓవర్లలో ఐర్లాండ్‌ స్కోరు: 114-5(15).

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఐర్లాండ్‌
14.4: శివం దూబే బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన బెంజమిన్‌ (23 బంతుల్లో 37). క్రీజులోకి డెలానీ. స్కోరు: 113-4(14.4). హ్యారీ టెక్టార్‌ 37 పరుగులతో ఉన్నాడు.

సెంచరీ కొట్టిన ఐర్లాండ్‌
13.2: హర్షిత్‌ రాణా బౌలింగ్‌ ఫోర్‌ బాదిన బెంజమిన్‌. సెంచరీ పూర్తి చేసుకున్న ఐర్లాండ్‌. 102-3(13.3).

12 ఓవర్లలో ఐర్లాండ్‌ స్కోరు: 88-3
బెంజమిన్‌ 18, హ్యారీ టెక్టార్‌ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్‌ డౌన్‌
7.3: ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగిన లోర్కాన్‌ టక్కర్‌ (18 బంతుల్లో 15). ఐర్లాండ్‌ స్కోరు: 50-3 (8). బెంజమిన్‌, హ్యారీ టెక్టార్‌ క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఐర్లాండ్‌
2.2: అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన రాస్‌ అడైర్‌ (7 బంతుల్లో 16).  కెప్టెన్‌ లోర్కాన్‌ టక్కర్‌ క్రీజులోకి వచ్చాడు. ఐర్లాండ్‌ స్కోరు: 26-2(3). టక్కర్‌ 1, హ్యారీ టెక్టార్‌ 4 పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఐర్లాండ్‌
1.5: హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ఇచ్చి పెవిలియన్‌ చేరిన టిమ్‌ టెక్టార్‌ (6 బంతుల్లో 5). హ్యారీ టెక్టార్‌ క్రీజులోకి వచ్చాడు. 

ఇద్దరి అరంగేట్రం
ఈ మ్యాచ్‌ సందర్భంగా తమ జట్టు తరఫున సూర్యాంశ్‌ షెడ్గే, ప్రిన్స్‌ యాదవ్‌ (టీ20) అరంగేట్రం చేస్తున్నట్లు టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు. సూర్యాంశ్‌ ఐపీఎల్‌లో సత్తా చాటాడని.. అతడి ఆట తీరుపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు. అయితే, చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీకి మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది.

తొలి టీ20లో విఫలమైన వాషింగ్టన్‌ సుందర్‌, ప్రసిద్‌ కృష్ణపై వేటు పడింది. వారిద్దరి స్థానాల్లో సూర్యాంశ్‌, ప్రిన్స్‌ యాదవ్‌ తుదిజట్టులోకి వచ్చారు. అయితే, ఐర్లాండ్‌ మాత్రం తొలి టీ20లో టీమిండియాపై గెలుపొందిన జట్టునే కొనసాగించింది. కాగా బెల్‌ఫాస్ట్‌ వేదికగా తొలి టీ20లో ఆతిథ్య ఐర్లాండ్‌ టీమిండియాను 34 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా తొలిసారి భారత జట్టుపై గెలుపు నమోదు చేసింది.

తుదిజట్లు
టీమిండియా
అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.

ఐర్లాండ్‌
టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై ముంద్రా, మాథ్యూ హోలార్డ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement