ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుపై విమర్శలు | Israel Spent On Its PM Benjamin Netanyahu Hair And Makeup Since 2019 | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుపై విమర్శలు

Sep 13 2026 6:55 PM | Updated on Sep 13 2026 8:17 PM

Israel Spent On Its PM Benjamin Netanyahu Hair And Makeup Since 2019

జెరూసలేం: ఇజ్రాయెల్‌లో ప్రధాని కార్యాలయ ఖర్చులకు సంబంధించి తాజాగా వెలువడిన అధికారిక సమాచారం తీవ్ర చర్చనీయాంశమైంది. 2019 నుంచి ఆగస్టు 2026 వరకు దేశ ప్రధానుల హెయిర్ స్టైలింగ్, మేకప్, అధికారిక ప్రాతినిధ్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం సుమారు  470,000వేల డాలర్లు( భారత కరెన్సీలో దాదాపు రూ. 4.49 కోట్లు) ఖర్చు చేసినట్లు వెల్లడైంది.

సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడంతో ప్రధాని కార్యాలయం ఈ వివరాలను బహిర్గతం చేసింది.ఈ ఖర్చుల్లో దాదాపు 90 శాతం కేవలం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహుల హెయిర్ స్టైలింగ్, మేకప్‌లకే ఖర్చయినట్లు తేలింది.

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న కాలంలోనూ (సెప్టెంబర్ - నవంబర్ 2023 మధ్య) ప్రధాని హెయిర్ స్టైలింగ్ కోసం సుమారు రూ. 2 లక్షలు వెచ్చించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కేవలం దేశంలోనే కాకుండా విదేశీ పర్యటనల సమయంలోనూ ఈ సౌకర్యాల కోసం భారీగా ఖర్చు పెట్టారు.

ఫిబ్రవరి 2025లో వాషింగ్టన్‌కు వెళ్లిన సమయంలో హెయిర్, మేకప్ నిమిత్తం సుమారు 13,500 డాలర్లు (భారత కరెన్సీలో రూ.12.9లక్షలు) ఖర్చయినట్లు డేటా ద్వారా తెలిసింది. ఈ ఖర్చులు వివిధ సంవత్సరాల్లో మారుతూ వచ్చాయి. ఇజ్రాయెల్‌ మాజీ ప్రధానులు నఫ్తాలీ బెనెట్, యైర్ లాపిడ్ తదితరులు ఆ పదవిలో ఉన్నకాలంతో పోలిస్తే, బెంజమిన్ నెతన్యాహు హయాంలో ఈ వ్యయం గణనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. అత్యధికంగా 2025 సంవత్సరంలో సుమారు రూ.1.06 కోట్లు ఖర్చయినట్లు రికార్డులు చెబుతున్నాయి.

 అయితే, భద్రతా కారణాలను చూపుతూ హెయిర్ స్టైలిస్టులు,మేకప్ ఆర్టిస్టుల పేర్లను వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. ప్రభుత్వ నిధుల దుబారాపై పౌర హక్కుల సంఘాలు,విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement