హైదరాబాద్: అమెరికా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న నగరానికి చెందిన యువకుడు గుండెపోటుతో కన్నుమూశారు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బేగంపేట్ ప్రకాశ్ నగర్‌కు చెందిన నగేష్ సాయికుమారి దంపతుల కుమారుడు రావుల పవన్ సాయి వంశీ (36) చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2016లో అమెరికాలో ఎంబీఏ చేశారు.
అనంతరం అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడి కొద్ది నెలల క్రితమే ఐబీఎంలో చేరారు. వంశీకి 2018లో వివాహమైంది. మూడున్నర సంవత్సరాల కుమారుడు, మూడు నెలల వయసు కూతురు ఉన్నారు. కుటుంబంతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఆయన ఈ నెల 9న ఉదయం పిల్లలతో ఇంట్లో ఆడుకుంటూ కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందడంతో ప్రకాశ్‌నగర్‌లోని ఆయన ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: అతనంటే నాకు ఇష్టం.. దేబ్జానీ ప్రపోజల్ హింట్!


