ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై తెగిపడ్డ విద్యుత్‌ తీగలు | Power Lines Snapped Into An Intercity Express Near Moulali | Sakshi
Sakshi News home page

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై తెగిపడ్డ విద్యుత్‌ తీగలు

Sep 14 2026 7:40 AM | Updated on Sep 14 2026 8:01 AM

Power Lines Snapped Into An Intercity Express Near Moulali

సాక్షి, హైదరాబాద్‌: మౌలాలి దగ్గర ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. అప్రమత్తమైన లోకోపైలట్‌ రైలును వెంటనే నిలిపివేశారు. భారీ శబ్దాలు ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు.. రైలు దిగి పరుగులు తీశారు. రైలు విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది.

ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్‌ తీగలను రైల్వే అధికారులు పునరుద్ధరించారు. అనంతరం ప్రయాణికులను అదే రైలులో సికింద్రాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై రైల్వే, విద్యుత్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక లోపం కారణంగానే విద్యుత్ తీగలు తెగిపడినట్లు అధికారులు నిర్థారించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement