అశోక్ కాలనీలో నిందితుడి ఇంటి ముందు గుమిగూడిన కాలనీ వాసులు
ఆలస్యంగా విషయం వెలుగులోకి..
హైదరాబాద్: ఓ మేనమామే ఆరేళ్ల వ యసున్న కోడలిపై అఘాయిత్యానికి ఒ డిగట్టాడు. కుము రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆల స్యంగా ఆదివారం వెలుగు లోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ రాఖీ పండుగకు తన ఆరేళ్ల కూతురును తీసుకుని కాగజ్‌నగర్ పట్టణంలోని తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చింది.
ఈ సమయంలో కూతురు అమ్మమ్మ దగ్గర ఉంటానని మారాం చేయడంతో అక్కడే వదిలి వెళ్లింది. అయితే బాలిక మేనమామ అయిన శశిధర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శశిధర్‌కు వివాహమైనా భార్య పుట్టింట్లోనే ఉంటోంది.
మూత్రం ఆగిపోవడంతో..
ఐదు రోజులుగా బాలికకు మూత్రం రాకపోవడంతో కడుపు ఉబ్బిపోయింది. రెండు రోజుల క్రితం బాలిక అమ్మమ్మ తన కూతురుకు సమాచారం ఇచ్చింది. దీంతో తల్లి పుట్టింటికి వెళ్లి కూతురును తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షలు చేసి బాలికపై లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించారు. సోదరుడిపైనే అనుమానం వచ్చిన తల్లి పుట్టింటికి వెళ్లి రోదిస్తూ తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ విషయం స్థానిక కౌన్సిలర్, కాలనీ పెద్దలకు ఆదివారం తెలిసింది.
కాలనీలో విషయం వ్యాపించడంతో కాలనీ వాసులు నిందితుడి ఇంటిని చుట్టుముట్టారు. మానవ మృగాన్ని ప్రజల మధ్యలోనే శిక్ష విధించాలని ఆందోళన చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ ప్రేమ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటల తర్వాత పోలీసులు నిందితుడిని ద్విచక్రవాహనంపై పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో జోరుగా వాన


