సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్, గాజులరామారం, కూకట్‌పల్లి, మియాపూర్‌లో వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, టోలిచౌకిలోనూ వర్షం కురుస్తోంది.
మరోవైపు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
వర్షం సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద ఉండకుండా జాగ్రత్త పడాలని సూచించారు. వాహనదారులు రోడ్లపై నీరు నిలిచిన చోట నెమ్మదిగా ప్రయాణించాలని, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇదీ చదవండి: ఏఐ.. రాక్షసి!!