breaking news
telangana weather
-
హైదరాబాద్‌లో మొదలైన వాన.. తెలంగాణకు బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జూలై మొదటి వారం వరకు వర్షాలు విస్తృతంగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నేటి నుంచి జూలై 2 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ప్రస్తుతం సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండగా, ఈ పరిస్థితి మరో రెండు గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకూ వర్షాలు విస్తరించనున్నాయి. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, నల్గొండ, జనగామ, సిద్ధిపేట, వరంగల్, హనుమకొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మరికొద్ది గంటల్లో వర్షాలు ప్రారంభమై మధ్యాహ్నం తర్వాత మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.రాజధాని హైదరాబాద్‌లో ఉదయం నుంచే చినుకులు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముండటంతో ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచిస్తున్నారు.వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.రానున్న ఏడు రోజుల పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ప్రజలు వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. -
తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దక్షిణ భారతదేశంలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, మరికొన్ని గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడనుంది. ముఖ్యంగా రంగారెడ్డి, నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట, జంగావు, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇక ఉత్తర–తూర్పు తెలంగాణలో ఉష్ణోగ్రతలు 41–43°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో 37–40 డిగ్రీల సెల్సియస్‌తో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం కొనసాగనుంది. అయితే మధ్యాహ్నం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ అంతరాయాలు, నీటి నిల్వలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకూడదని, నదులు, వాగుల వద్దకు చేరకూడదని స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. వర్షాల తీవ్రత గంటల వ్యవధిలోనే పెరిగే అవకాశం ఉండటంతో అన్ని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.INTENSE THUNDERSTORM ALERT for South, Central, East TG - June 10⚠️🌩️⛈️Today, HOT and HUMID conditions (like summer) expected in entire Telangana. North East TG - 41-43°C, Hyderabad 37-40°C, dry till afternoon ⚠️Thereafter, POWERFUL THUNDERSTORMS and HEAVY RAINS expected in…— Telangana Weatherman (@balaji25_t) June 10, 2026 -
Cyclone Montha: తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: మోంథా తీవ్ర తుపాను కారణంగా సోమవారం నుంచి తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే రెడ్ అలర్ట్ జారీ చేసిన నాలుగు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మోంథా ప్రభావంతో ఇవాళ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, జనగామ, ఖమ్మం, కొమురంభీం, మంచిర్యాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడొచ్చని, అలాగే.. సిద్ధిపేట, సూర్యాపేటలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని అధికారులు అంటున్నారు. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన నేపథ్యంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అలాగే రేపు(బుధవారం) నాలుగు జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తుపాన్ తీరం దాటే సమయంలో.. ఇటు తెలంగాణలోనూ గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. తుపాను ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు తప్పవని అధికారులు అంటున్నారు.మోంథా నేపథ్యంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తూనే.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.క్లిక్ చేయండి: కాకినాడకు చేరువలో మోంథా.. బీభత్సం చూశారా? -
తెలంగాణలో మరో రెండు రోజులు వానలే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్, హన్మకొండ, జనగామ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఈ రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30- 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని, శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం వాతావరశాఖ తెలిపింది. ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశాలున్నాయని.. 26 నాటికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరానికి తుఫాను చేరుతుందని పేర్కొంది. బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరించాయి. -
తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తుండగా.. మూడు రోజులపాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాగల మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో రేపు(శుక్రవారం) భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక రాజధాని హైదరాబాద్ నగరంలో వచ్చే రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
కుండపోత వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం
-
అలర్ట్: మరో మూడు రోజులు భారీ వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. మరికొన్ని చోట్ల ఇంకా వర్షప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక కుండపోత వర్షంతో రాజధాని హైదరాబాద్.. జంట నగరం సికింద్రాబాద్లు అతలాకుతలం అయ్యాయి. ఎటు చూసినా నగర జీవనం అస్తవ్యస్తంగా కనిపించింది. రెండు గంటల్లో.. దాదాపు 10 సెం.మీ. మేర కురిసింది వాన. మోకాళ్ల లోతు నీరు ఎటు చూసినా నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు భారీగా ట్రాఫిక్‌ఝామ్ కాగా.. కిలోమీటర్ దూరం దాటేందుకు గంటకు పైగా ఎదురు చూడాల్సి వస్తోంది. రంగారెడ్డి, శంషాబాద్ మండలాల్లోనూ భారీ వర్షాల ప్రభావం కనిపించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంతో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయ్యింది. మూసీకి వరద నీరు పోటెత్తడంతో అంబర్‌పేట మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు చేరింది. ఖైరతాబాద్-పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్‌జామ్ భారీగా అయ్యింది. చాలాచోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. వర్షం మొదలైన కాసేపటికే పరిస్థితిని అంచనా వేసిన అధికారులు ప్రయాణాన్ని రెండు గంటలపాటు వాయిదా వేసుకోవాలంటూ ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగానే వాహనదారులకు సూచించడం తెలిసిందే. నగరంలో.. నాంపల్లిలో అత్యధికంగా 9.2 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే.. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో 8.6. ఖైరతాబాద్ 7.5 సెం.మీ. సరూర్‌నగర్ 7.2 సెం.మీ. రాజేంద్రనగర్‌లో 6.4 సెం.మీ, మెహదీపట్నంలో 4.5 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరంగల్ జిల్లాలో భారీ వర్షం
-
తెలంగాణలో భారీ వర్షాలు నీట మునిగిన కాలనీలు
-
హైదరాబాద్ లో భారీ వర్షం
-
మరో రెండురోజులు పగలు కూడా చ...చ... చలే!
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు పగటిపూట కూడా చలిగాలులు తప్పవు. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రాంతాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా బాగా కిందకు పడిపోయాయి. రాష్ట్రం మొత్తమ్మీద మెదక్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలలో శని, ఆది వారాలలో చలి గాలులు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించిన వాతావరణ పరిస్థితులను వివరిస్తూ ఈ విషయం తెలిపారు.


