మరో రెండురోజులు పగలు కూడా చ...చ... చలే! | Cold day conditions likely to prevail in Telangana tomorrow | Sakshi
Sakshi News home page

మరో రెండురోజులు పగలు కూడా చ...చ... చలే!

Nov 19 2016 7:11 PM | Updated on Sep 4 2017 8:33 PM

మరో రెండురోజులు పగలు కూడా చ...చ... చలే!

మరో రెండురోజులు పగలు కూడా చ...చ... చలే!

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు పగటిపూట కూడా చలిగాలులు తప్పవు.

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు పగటిపూట కూడా చలిగాలులు తప్పవు. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రాంతాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా బాగా కిందకు పడిపోయాయి. రాష్ట్రం మొత్తమ్మీద మెదక్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 
 
ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలలో శని, ఆది వారాలలో చలి గాలులు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించిన వాతావరణ పరిస్థితులను వివరిస్తూ ఈ విషయం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement