పొగమంచు అలర్ట్‌.. పలు విమానాలు ఆలస్యం | Thick fog blankets Delhi-NCR And flight delays | Sakshi
Sakshi News home page

పొగమంచు అలర్ట్‌.. పలు విమానాలు ఆలస్యం

Jan 15 2026 7:31 AM | Updated on Jan 15 2026 7:31 AM

Thick fog blankets Delhi-NCR And flight delays

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగ మంచు కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గురువారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో, విజిబులిటీ తగ్గిపోయింది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ జిల్లా స్థాయి నౌకాస్ట్ ఢిల్లీపై రాబోయే రెండు గంటల పాటు ఒక మోస్తరు పొగమంచు ఉంటుందని హెచ్చరించింది. అనేక చోట్ల విజిబులిటీ 50 మీటర్ల కంటే తక్కువగా పడిపోయే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. అలాగే, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లను కూడా పొగ మంచు ప్రభావితం చేసింది. ఉదయం 7 గంటల తర్వాత పొగమంచు తీవ్రమవుతుందని.. ఇది వాహనాలు, విమానాల రాకపోకలను ప్రభావితం చేస్తుందని అధికారులు తెలిపారు.

 

ఈ సందర్భంగా ఎయిర్‌ ఇండియా.. ప్రయాణీకులను అలర్ట్‌ చేసింది. పొగ మంచు కారణంగా పలు ఎయిర్‌ ఇండియ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్టు చెప్పుకొచ్చింది. విమానాల మళ్లింపు, రద్దులపై ఎప్పటికప్పుడు సమాచారం అందుబాటులో ఉంటుందని.. ప్రయాణికులు సహకరించాలని కోరింది.

మరోవైపు.. ఉత్తరభారతాన్ని చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్‌, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. మంగళవారం ఉదయం రాజధానిలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఈ శీతాకాలంలో ఇదే అతి కనిష్ట ఉష్ణోగ్రత కూడా. దీంతో చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement