breaking news
Fog disrupts
-
పొగమంచు అలర్ట్.. పలు విమానాలు ఆలస్యం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగ మంచు కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.ఢిల్లీ-ఎన్సీఆర్లో గురువారం తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో, విజిబులిటీ తగ్గిపోయింది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ జిల్లా స్థాయి నౌకాస్ట్ ఢిల్లీపై రాబోయే రెండు గంటల పాటు ఒక మోస్తరు పొగమంచు ఉంటుందని హెచ్చరించింది. అనేక చోట్ల విజిబులిటీ 50 మీటర్ల కంటే తక్కువగా పడిపోయే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. అలాగే, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లను కూడా పొగ మంచు ప్రభావితం చేసింది. ఉదయం 7 గంటల తర్వాత పొగమంచు తీవ్రమవుతుందని.. ఇది వాహనాలు, విమానాల రాకపోకలను ప్రభావితం చేస్తుందని అధికారులు తెలిపారు.#WATCH | Ghazipur, UP: Dense fog engulfs Ghazipur area as cold wave prevails throughout the city. pic.twitter.com/bAS7ST9JBW— ANI (@ANI) January 15, 2026 ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా.. ప్రయాణీకులను అలర్ట్ చేసింది. పొగ మంచు కారణంగా పలు ఎయిర్ ఇండియ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్టు చెప్పుకొచ్చింది. విమానాల మళ్లింపు, రద్దులపై ఎప్పటికప్పుడు సమాచారం అందుబాటులో ఉంటుందని.. ప్రయాణికులు సహకరించాలని కోరింది.#WATCH | Delhi: A thick layer of fog engulfs the national capital. Visuals from Moti Bagh. pic.twitter.com/Db74gScuYO— ANI (@ANI) January 15, 2026మరోవైపు.. ఉత్తరభారతాన్ని చలిపులి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీలో ఈ సీజన్లోనే అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. మంగళవారం ఉదయం రాజధానిలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఈ శీతాకాలంలో ఇదే అతి కనిష్ట ఉష్ణోగ్రత కూడా. దీంతో చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. #WATCH | Delhi: A thick layer of fog engulfs the national capital. Visuals from Dwarka Sector 16. pic.twitter.com/g4rhHi504A— ANI (@ANI) January 15, 2026 -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. గాలి నాణ్యత ‘తీవ్ర’స్థాయికి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి నగరాన్ని ఘనమైన పొగమంచు, చల్లటి వాతావరణం కమ్మేసింది. దీంతో గాలి నాణ్యత సూచిక (AQI) తీవ్ర స్థాయికి చేరువైంది. శనివారం రాత్రి 11 గంటలకు గాలి నాణ్యత (AQI)410కి చేరి తీవ్ర స్థాయికి చేరింది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు AQI 396గా నమోదైంది. ప్రభావిత ప్రాంతాలు.. చాంద్ని చౌక్ – 455, వజీర్పూర్ – 449, రోహిణి – 444, జహాంగీర్‌పురి – 444, ఆనంద్ విహార్ – 438 , ముండ్కా – 436కి గాలి నాణ్యత చేరడంతో ఈ ప్రాంతాలన్నీ తీవ్ర కాలుష్యం వర్గంలోకి చేరాయి. దాంతో భారత వాతావరణ శాఖ (IMD) ఘనమైన పొగమంచు హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. చల్లటి వాతావరణం,తక్కువ గాలి వేగం, ఉష్ణోగ్రత మార్పులు కాలుష్యాన్ని నేలమట్టం వద్దే నిలిపేశాయి. ఈ నేపధ్యంలో రోడ్డు, రైలు, విమాన రవాణాపై అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలున్నవారికి ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపునులు పేర్కొన్నారు.తక్కువ గాలి వేగం, ఉష్ణోగ్రత ఇన్వర్షన్ కారణంగా కాలుష్యం నేలమట్టం వద్దే నిలిచిపోతుందని నిపుణులు తెలిపారు. శీతాకాలం మరింతగా పెరుగుతున్న కొద్దీ ఢిల్లీలో గాలి కాలుష్యం సమస్య మళ్లీ మళ్లీ తలెత్తుతుందని హెచ్చరించారు. ఢిల్లీలో గాలి నాణ్యత సమస్యపై దీర్ఘకాలిక పరిష్కారాలు, స్థిరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. -
ఉత్తరాదిపై మంచుదుప్పటి
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ..ఉత్తర భారతంలో పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. పగలంతా దట్టమైన పొగమంచు కొనసాగుతుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో సాధారణ జనజీవనానికి అంతరాయం కలుగుతోంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో అక్కడక్కడా మంచు, వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో భారీగా మంచుకురుస్తుందని తెలిపింది. కశ్మీర్లో 40 రోజులపాటు అత్యంత కఠినమైన శీతల పరిస్థితుల కాలం చిల్లై కలాన్ ఆదివారం నుంచి మొదలుకానుంది. పుల్వామాలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టంగా మైనస్ 3.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోగా, శ్రీనగర్‌లో మైనస్ 0.4 డిగ్రీ, అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ ఉన్న పహల్గాంలో మైనస్ ఒక డిగ్రీగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని పేర్కొంది. శ్రీనగర్‌తోపాటు లోయలోని అత్యధిక ప్రాంతాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుందని పేర్కొంది. అదేసమయంలో, హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్, మండి జిల్లాలతోఆపటు బాల్హ్‌లోయలో ఉదయం, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని తెలిపింది. ఈ నెల 25వ తేదీ వరకు పర్వత ప్రాంతాల్లో అక్కడక్కడా కొద్దిపాటి మంచు, వర్షం కురిసే అవకాశముందని అంచనా వేసింది. కుకుమ్‌సెరి, లాహోల్ స్పిటి జిల్లాలో మైనస్ 5.7 డిగ్రీలు, టాబోలో మైనస్ 2.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ విభాగం తెలిపింది. ఢిల్లీలో ఆరెంజ్ అలెర్ట్ వాయు కాలుష్యంతో సతమతమవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో సూర్యుడిని మేఘాలు కమ్మేశాయి. దీంతో, దృగ్గోచరత క్షీణించింది. ఢిల్లీలో శీతల గాలుల సీజన్ శనివారం నుంచి మొదలైంది. ఈ నెలలోనే గరిష్ట ఉష్ణోగ్రత 16.9 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 5.3 డిగ్రీలుగా నమోదైంది. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. గంటకు 10 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వీస్తున్న గాలులు కాలుష్య కారకాలు చెల్లాచెదురయ్యేందుకు అనుకూలం కావని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం మరో రెండు రోజులపాటు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, కాన్పుర్, బరేలీ, ఝాన్సీ తదితర ప్రాంతాల్లో దృగ్గోచరత 50 మీటర్లలోపునే ఉంది. పంజాబ్, హరియాణాలతో కూడా తీవ్ర శీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. దట్టమైన పొగమంచు కురుస్తోంది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 4.9 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. రాజస్తాన్, జార్ఖండ్లలోనూ ఇవే పరిస్థితులున్నాయి.129 విమానాలు రద్దుఢిల్లీలో దట్టమైన పొగమంచు అలుముకున్న కారణంగా విమానాశ్రయం అధికారులు ముందు జాగ్రత్తగా కనీసం 129 విమాన సర్వీసులను రద్దు చేశారు. తక్కువ దృగ్గోచరత కారణంగా కొన్ని రోజులుగా ఢిల్లీ, ఇతర విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని అత్యంత పెద్దది. నిత్యం ఇక్కడ 1,300 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. -
ఇంకా గ్యాస్ చాంబర్‌లానే ఢిల్లీ!
న్యూఢిల్లీ: నివారణ చర్యలు చేపట్టినా కూడా రాజధానిలో వాయు కాలుష్యం తగ్గడం లేదు. ఢిల్లీలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసి, దృశ్యమానత గణనీయంగా తగ్గిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం గురువారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) 358 వద్ద నమోదైంది. ప్రస్తుత ఏక్యూఐ చాలా పేలవమైన విభాగంలోకి వస్తుంది. ఢిల్లీలోని 39 మానిటరింగ్ స్టేషన్లలో నాలుగు తీవ్రమైన కేటగిరీలో AQI నమోదు కాగా, మరికొన్ని ఇంకా కింద ఉన్నాయి. బుధవారం 24 గంటల సగటు AQI 334గా నమోదైంది. NCRలోని నోయిడా (331), గ్రేటర్ నోయిడా (310), గురుగ్రామ్ (279)లో కూడా గాలి నాణ్యత దారుణంగా ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఉదయం వేళల్లో వాయువ్య దిశ నుండి గంటకు 10 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నం వేళల్లో గాలి వేగం 15 కి.మీ వరకు పెరుగుతుంది. సాయంత్రం, రాత్రి సమయంలో పశ్చిమ దిశ నుండి 10 కి.మీ కంటే తక్కువకు పడిపోతుంది. ఈ గాలి మార్పులు పొగమంచును వెదజల్లడంలో సహాయపడతాయి. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలో పెద్ద మార్పు ఉండదు, తరువాతి రోజుల్లో 2 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని IMD అంచనా వేసింది. రాకపోకలకు అంతరాయమే..ఢిల్లీ విమానాశ్రయం తక్కువ విజిబిలిటీ కారణంగా ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక జారీ చేసింది. విమాన కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నప్పటికీ, ప్రయాణికులు తమ విమాన స్థితిని సంబంధిత ఎయిర్‌లైన్స్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు. ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ కూడా ప్రయాణికులకు సలహాలు జారీ చేశాయి. తాజా నిబంధనలతో గుర్గావ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా నుంచి ఎంటర్ అయ్యే 12 లక్షల వాహనాలపై ప్రభావం పడనుంది. ఈ వాహనాల తనిఖీ కోసం 126 చెక్ పాయింట్ల వద్ద 580 మంది పోలీసుల మోహరించారు. పెట్రోల్ బంకుల వద్ద ట్రాన్స్పోర్ట్, ఎం సి డి ,ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారుల మోహరించారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ వాహనాలకు ఇంధన సరఫరా నిలిపివేతఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం పలు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టింది గ్రాప్ IV కింద అత్యంత కఠినమైన కాలుష్య నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. గ్రాఫ్ ఫోర్ నిబంధనల నేపథ్యంలో ఒకటి నుంచి ఐదో తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మిగిలిన తరగతులకు హైబ్రిడ్ మోడ్ క్లాసులు జరగనున్నాయి. పీయూసీసీ (Pollution Under Control Certificate) లేని వాహనాలకు ఇంధన సరఫరా నిలిపివేయబడుతుంది. BS-VI నిబంధనల కంటే తక్కువ ఉన్న ఢిల్లీయేతర వాహనాలు రాజధానిలోకి ప్రవేశించకుండా నిరోధించబడ్డాయి. పార్లమెంట్లో నేడు చర్చఢిల్లీ-ఎన్సీఆర్లో పొగమంచు, వాయు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో AQI చాలా దారుణమైన స్థాయికి పడిపోతుందని ఓ అంచనా. ఢిల్లీ వాయు కాలుష్యంపై నేడు లోక్ సభలో చర్చ జరగనుంది. విపక్షాల నుండి చర్చ ప్రారంభించనున్న ప్రియాంకా గాంధీ, డింపుల్ యాదవ్. బీజేపి తరపున చర్చలో నిషికాంత్ దూబే, బన్సూరీ స్వరాజ్ పాల్గొననున్నారు. -
విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసి నగర జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విజిబులిటీ పడిపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. సోమవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర భారతదేశానికి భారీ పొగమంచు అలర్ట్ జారీ చేసింది. అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని విమానాలు మార్గం మళ్లించబడ్డాయి. విమాన ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది. Heavy Fog Alert for Northern IndiaDelhi (DEL) & other airports in Northern India are experiencing dense fog, severely affecting visibility.For Passengers:Before heading to the airport, please check the latest flight status with your airline.Check flight information on the…— MoCA_GoI (@MoCA_GoI) December 15, 2025ఉత్తర భారతదేశంలో శీతాకాలం తీవ్రత పెరగడంతో పొగమంచు మరింతగా అలుముకుంటోంది. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే రోజుల్లో కూడా పొగమంచు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. -
బెంబేలెత్తిస్తున్న పొగమంచు.. ఢిల్లీ అతలాకుతలం
ఢిల్లీ: ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో.. చలిగాలుల ప్రభావం దేశమంతటా కనిపిస్తోంది. దేశ రాజధానిలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దట్టంగా పొగమంచు కమ్మేయడంతో(zero visibility) రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సుమారు 100 దాకా విమానాలు, పలు రైళ్లు రద్దు అయ్యాయి. ఇక రెండు వారాల తర్వాత ఇవాళ స్కూల్స్ తెరుచుకోవాల్సి ఉండగా.. చలి కారణంగా వేళల్లో మార్పులు చేశారు. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి.. పొగ మంచు తోడు కావడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఉదయం 11 గంటలకైనా సూర్యుడి కనిపించడం లేదు. పొగమంచుతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. సోమవారం ఉదయం వంద విమాన సర్వీసులు రద్దు కాగా.. మరో 128 సర్వీసులు గంటకు తక్కువ కాకుండా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో సంయమనం పాటించాలని ప్రయాణికులను ఢిల్లీ ఎయిర్పోర్ట్ కోరుతోంది. మరోవైపు ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ వద్ద కొనసాగుతోంది. శుక్రవారం అది రికార్డు స్థాయిలో 3.9గా.. శనివారం ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్ నమోదు అయిన సంగతి తెలిసిందే. మరోవైపు వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. -
గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు
-
భారీగా పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు
కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఉదయం పొగమంచు కప్పేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండ్ అయ్యేందుకు వీలులేక బెంగుళూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్పైస్ జెట్ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. బెంగుళూరు నుంచి సుమారు 50మంది ప్రయాణికులతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన స్పైస్ జెట్ విమానం సుమారు అరగంట పాటు 8 సార్లు చక్కర్లు కొట్టింది. అనంతరం ల్యాండ్ అయ్యేందుకు వీలు లేకపోవడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం, ఢిల్లీ నుంచి వచ్చిన మరో ఇండిగో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొట్టాయి. దాదాపు 10 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలు లేకపోవడంతో పాట్నాకి దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగిందని ఎయిర్‌పోర్టు అధికారలు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. పొగ మంచు పరిస్థితులు చక్కబడ్డాక విమానాల ల్యాండింగ్‌కు తిరిగి అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. చదవండి: 7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు! -
7 సార్లు చక్కర్లు కొట్టి వెనుదిరిగిన విమానం
సాక్షి, కృష్ణా: జిల్లాలోని గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు దుప్పటిలా కప్పేసింది. దాంతో గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలు ఆలస్యం అవుతాయని అధికారులు వెల్లడించారు. ఇక శనివారం ఉదయం ఢిల్లీ నుండి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాలిలో చక్కర్లు కొట్టింది. 7 సార్లు చక్కర్లు కొట్టిన అనంతరం దిగేందుకు వీలులేక హైదరాబాద్ వెనుదిరిగింది. -
40 నిమిషాలు గాల్లోనే చక్కెర్లు కొట్టిన విమానాలు
గన్నవరం : దట్టమైన పొగమంచు కారణంగా విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఉదయం విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానాలు సుమారు 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. తెల్లవారుజాము నుంచి గన్నవరం విమానాశ్రయంలో రన్‌వేని పూర్తిగా పొగ మంచు కప్పేయడంతో ఉదయం 8.00 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన ట్రూజెట్ విమానం ల్యాండింగ్‌కు ఇబ్బంది ఏర్పడింది. అలాగే హైదరాబాద్-విజయవాడ-బెంగళూరు స్పైస్ జెట్, హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్ స్పైస్ జెట్ విమానాలు ల్యాండింగ్‌కు అవకాశం లేకపోవడంతో తిరిగి వెనక్కు వెళ్లిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్, బెంగుళూరుల నుండి కనెక్టివిటీ విమానాలలో వెళ్ళవలసిన ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. -
చెన్నైను కమ్మేసిన పొగమంచు..
సాక్షి, చెన్నై : చెన్నై నగరాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో పొగమంచు భారీగా పేరుకుపోవడంతో అధికారులు.. 12 విమానాలను దారి మళ్లించారు. అలాగే చెన్నై విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన మరో 30 విమానాలు ఆలస్యంగా వెళ్లనున్నాయి. విమానాలు బయలుదేరడానికి కనీసం 400 మీటర్ల మేర విజిబులిటి ఉండాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం పొగమంచు కారణంగా 50 మీటర్ల విజిబులిటి మాత్రమే ఉండటంతో విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు...విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్నారు. మరోవైపు చెన్నై నుంచి ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి నాలుగు విమానాలు రావల్సి ఉండగా, వెలుతురు సరిగా లేకపోవడంతో ఆ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
పది కార్లు ఒకదానికొకటి..ఢీ
-
పది కార్లు ఒకదానికొకటి..ఢీ
లక్నో: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఊహించని రీతిలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పొగమంచుతో వెలుతురు సరిగాలేని కారణంగా పాదచారులతో పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా గ్రేటర్ నోయిడా దన్కౌర్ ప్రాంతంలో గౌతమ్ బుద్ధా నగర్ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద సుమారు పది వాహనాలు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీ కొనడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో ఉన్న ప్రయాణికులు ..భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగమంచు కారణంగా ఏం కనపడక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం పది గంటలైన పొగమంచు వీడకపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా పలు రోడ్డు ప్రమాదాలు కేసులు నమోదవుతున్నాయి. పంజాబ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. ఉత్తరప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పొగమంచు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీని పొగమంచు చుట్టుముట్టేసిన విషయం తెలిసిందే. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో ఢిల్లీ సర్కార్ పాఠశాలలకు ఆదివారం వరకూ సెలవు ప్రకటించింది. కాగా యమునా ఎక్స్‌ప్రెస్ వేపై 2016 డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో మళ్లీ వైరల్‌గా మారింది. -
పొగమంచుతో 90 విమానాలు రద్దు
న్యూఢిల్లీ: పొగమంచు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ప్రభావం చూపింది. పొగ మంచు దట్టంగా అలముకోవడంతో విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు మూడు గంటల పాటు విమానాలు నిలిచిపోయాయి. సుమారు 150 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడవం, కొన్నింటిని దారి మళ్లించారు. మంచు కారణంగా వెలుతురు మందగించడంతో పలు విమానాలు రద్దు చేశారు. గత రాత్రి 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల మధ్యలో 90 విమానాలు రద్దు చేసినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. పొగమంచుతో రైళ్ల రాకపోకలకు కూడా ఆటంకం కలిగింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, కొన్ని రద్దయ్యాయి. ఉదయం సమయంలో రోడ్లపై వాహనాలు సంచారం చాలా తక్కువగా ఉంది. -
ఢిల్లీలో కనిష్టానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు. కనెక్టింగ్ ఫ్లైట్, ట్రైన్ పట్టుకోలేకపోతున్నామని, దీంతో చాలా సమయం వృధా అయిపోతోందని ప్రయాణికులు అంటున్నారు. అయితే ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాహనదారులు తెలిపారు. పొగమంచు కారణంగా పగటిపూట కూడా లైట్లు వేసుకుని డ్రైవింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇళ్లల్లోంచి బైటకు రావాలంటేనే భయమేస్తుందని స్థానికులు వెల్లడించారు. డిసెంబర్ మాసంలోనే చలి ఇంతగా ఉంటే, ఇక జనవరిలో ఎలా ఉంటుందోనని హస్తినవాసులు గజగజలాడుతున్నారు. అలాగే పంజాబ్‌పై చలి పంజా విసిరింది. చలిగాలులతో అమృత్‌సర్‌వాసులు వణికిపోతున్నారు. మంటలు వేసుకుని ... గరం గరం ఛాయ్ తాగుతూ ... వెచ్చదనాన్ని పొందుతున్నారు. అయితే బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పొగమంచు కారణంగా విమానాలు విమానాశ్రయానికే పరిమితమైనాయి. అలాగే రైళ్లు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీతమైన చలి ఉండడంతో బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్‌లో చలికి గజగజలాడుతూ .. బస్సులు, రైళ్ల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.


