సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసి నగర జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విజిబులిటీ పడిపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. సోమవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర భారతదేశానికి భారీ పొగమంచు అలర్ట్ జారీ చేసింది.
అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని విమానాలు మార్గం మళ్లించబడ్డాయి. విమాన ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది.
Heavy Fog Alert for Northern India
Delhi (DEL) & other airports in Northern India are experiencing dense fog, severely affecting visibility.
For Passengers:
Before heading to the airport, please check the latest flight status with your airline.
Check flight information on the…— MoCA_GoI (@MoCA_GoI) December 15, 2025
ఉత్తర భారతదేశంలో శీతాకాలం తీవ్రత పెరగడంతో పొగమంచు మరింతగా అలుముకుంటోంది. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే రోజుల్లో కూడా పొగమంచు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.


