బంజారాహిల్స్: కొత్తగా కొన్న కారును అడ్డుకుని రూ.2 లక్షలు డిమాండ్ చేసిన ట్రాన్స్‌జెండర్లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45లో రెండు వారాల క్రితం నలుగురు ట్రాన్స్‌జెండర్లు కొత్త కారును అడ్డగించి అందులోని వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ‘ఎక్స్’లో వీడియో పోస్ట్ అయ్యింది. ఈ వీడియో ఆధారంగా విచారణ చేపట్టగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BMW owner harassed by transgenders in Hyderabad, demanding 2 lakh rupees after new car was delivered pic.twitter.com/zVFXKdbJh8
— Mogambo (@Netajinonsense1) September 11, 2026


