సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ కిషన్‌గూడ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. హోటల్‌లోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. ఎదురుగా కంటైనర్ రావడంతో అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. విద్యుత్ పోల్‌న ఢీ కొడుతూ ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. పార్కింగ్ చేసి ఉన్న కార్లను బైక్‌ను ఢీకొడుతూ దూసుకెళ్లింది.
ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో సహా పలువురు గాయపడ్డారు. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మృతుడిని కరీంనగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దుబాయ్‌కి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్తూ మధ్యలో టీ తాగడం కోసం హోటల్ దగ్గర ఆగిన అజ్మల్.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ అజ్మల్ మృతి చెందారు.
ఇదీ చదవండి: వినాయక చవితి వేళ.. విజృంభించిన వరుణుడు


