breaking news
kaif
-
విడాకులు తీసుకున్న మహిళను నమ్మించి...
టీమిండియా వెటరన్ బౌలర్ మహ్మద్ షమీ సోదరుడు, క్రికెటర్ మహ్మద్ కైఫ్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని తనను మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడాకులు తీసుకున్న మహిళను నమ్మించి...దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. క్రికెటర్ షమీ సోదరుడు కైఫ్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న సదరు మహిళకు కైఫ్ మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు.హోటల్‌కు రప్పించిబలవంతం మీద ఆమెను సెప్టెంబరు 9, 2023న కోల్‌కతాలోని ఓ హోటల్‌కు రప్పించి శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని కోరగా.. ఆమెతో స్నేహాన్ని తెంచుకున్నాడు. ఈ మేరకు సదరు మహిళ ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని అర్షియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కైఫ్‌పై కేసు నమోదైందని రిపోర్టర్ అభిషేక్ త్రిపాఠి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.అన్న మాదిరే బెంగాల్‌కు ఆడుతూ..కాగా అన్న షమీ మాదిరే కైఫ్ కూడా క్రికెటర్. ఉత్తరప్రదేశ్ వీరి సొంత రాష్ట్రం అయినప్పటికీ అన్న బాటలోనే దేశవాళీ క్రికెట్లో కైఫ్ బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్మద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు పలు దేశీ టోర్నమెంట్లలో ఆడుతున్నాడు. మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటికి 40కి పైగా వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. ఇంతకుముందు కూడా ఓ మహిళ కైఫ్‌పై ఇదే తరహాలో ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఆరోపించింది. అయితే, అధికారికంగా కేసు మాత్రం పెట్టలేదని సమాచారం. కాగా షమీపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.షమీపై కూడా గతంలో ఆరోపణలుషమీ భార్య హసీన్ జహాన్ స్వయంగా తీవ్రమైన ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కింది. అతడికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించడంతో పాటు ఫిక్సింగ్ చేస్తాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పటి నుంచి విడిగా ఉంటున్న వీరు.. భరణానికి సంబంధించి తరచూ ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తున్నారు. కాగా హసీన్ జహాన్ ఐపీఎల్లో చీర్ గర్ల్‌గా ఉన్న సమయంలో ఆమె ప్రేమలో పడ్డ షమీ.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అయితే, అప్పటికే హసీన్‌కు వివాహమై కూతురు కూడా ఉన్నట్లు సమాచారం. షమీ- హసీన్‌కు కూడా ఓ కుమార్తె జన్మించింది.చదవండి: వద్దన్నా వినడే.. ఇదేం బుద్ధి? -
యూవీ అవుటవ్వగానే.. గుండెపగిలింది : కైఫ్
నాట్‌వెస్ట్ సిరీస్-2002 గుర్తుందా! ఫైనల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా 326 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి చరిత్ర సృష్టించింది. టాప్ ఆర్డర్ విఫలమైన ఈ ఉత్కంఠ పోరులో మహ్మద్ కైఫ్ (87), యువరాజ్ సింగ్ (69) అద్భుత బ్యాటింగ్‌తో భారత్ మ్యాచ్ గెలిచింది. నాట్‌వెస్ట్ సిరీస్ విజయానంతరం అప్పటి కెప్టెన్, టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ షర్ట్ విప్పి గ్యాలరీలో సందడి చేయడం ప్రతీ క్రికెట్ అభిమానికి ఓ మధురానుభూతి. నాటి రోజులను ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్‌లు గుర్తు చేసుకుంటూ.. పలు ఆసక్తికర విషయాలని అభిమానులతో పంచుకున్నారు. నాడు ఇంగ్లడ్ గడ్డ మీద 326పరుగుల లక్ష్య ఛేదనలో 145 పరుగుకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో భారత్ పడింది. ఆ సమయంలో క్రీజ్‌లో ఉన్న యూవీ, కైఫ్‌లు అద్భుత ప్రదర్శనతో గెలుపుపై ఆశలు చిగురించేలా చేశారు. అయితే 69 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువీ ఔటయ్యాడు. ‘యూవీ, నేను క్రీజ్‌లో చివరి వరకు ఉంటే మ్యాచ్ గెలువొచ్చు అనుకున్నా. కానీ, యూవీ అవుటవ్వడంతో ఒక్కసారిగా గుండెపగిలినంత పనయ్యింది. గెలుపు దాదాపు అసాధ్యం అనుకున్నా’ అని నాటి రోజులను కైఫ్ గుర్తు చేసుకున్నారు. అప్పటికీ 59 పరుగుల లక్ష్యం భారత్ ముందు ఉంది. టెయిలెండర్లతో కలిసి బాధ్యతాయుతంగా కైఫ్ బ్యాటింగ్ చేసి, మరో మూడు బంతులు మిగిలుండగానే భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కైఫ్ 87 పరుగులు చేసి నాట్ వెస్ట్ సిరీస్ ను భారత్‌కు అందించాడు. ఫీల్డింగ్‌లో చిరుతలా కదులుతూ భారత్‌కు మహ్మద్ కైఫ్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని యూవీ ఇన్స్టాగ్రామ్లైవ్ చాట్‌లో పొగడ్తలతో ముంచెత్తాడు. పాయింట్, కవర్లలో తామిద్దరం కలిసి భారత ఫీల్డింగ్ విభాగంలో ఒక కొత్త సరళిని తీసుకొచ్చామన్నారు. ఇప్పుడున్న భారత జట్టులో మంచి ఫీల్డర్లున్నారని, కానీ భారత జట్టు ఫీల్డింగ్‌లో ఓ కొత్త ఒరవడి మాత్రం తామే తీసుకొచ్చామని నవ్వుతూ యూవీ చెప్పారు. -
క్రికెటర్ కైఫ్ ట్వీట్‌పై ప్రధాని స్పందన
లక్నో: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభినందిస్తూ ట్వీట్ల వర్షం కురింసింది. భారత క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సైతం ప్రధానమంత్రికి ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారతీయ జనతాపార్టీ అద్భుత విజయం నమోదు చేసిందని.. ముఖ్యంగా యూపీలో ఆ పార్టీ విజయం భారీగా ఉందని కైఫ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రధాని కైఫ్ ట్వీట్‌పై స్పందించారు. కైఫ్ అభినందనలకు ధన్యవాదాలు తెలిపిన మోదీ.. ప్రజల నుంచి లభించిన మద్దతు చరిత్రాత్మకమైనది అని పేర్కొన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని పుల్పుర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కైఫ్ పోటీచేసి.. కేశవప్రసాద్ మౌర్య(బీజేపీ) చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.


