సాక్షి, చెన్నై: తమిళనాడులో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల పేరుతో కోట్లాది రూపాయల డిపాజిట్లను సమీకరించి భారీ కుంభకోణానికి పాల్పడిన యూనిక్ ఎక్స్‌పోర్ట్స్ గుట్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రట్టు చేసింది. ఈరోడ్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ నకిలీ సంస్థ 35,759 మంది నుంచి రూ.1,417.86 కోట్లు వసూలు చేసింది. ఈ నిధులను దారి మళ్లించడానికి మోసపూరిత మార్గాలను ఎంచుకుంది.
ఈ కంపెనీలో నలుగురు ఉద్యోగులే పనిచేస్తుండగా, వారికి జీతాల రూపంలో రూ.390.90 కోట్లు చెల్లించినట్లు దొంగ లెక్కలు చూపింది. అలాగే రూ.719 కోట్లను కంపెనీ యజమానులు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెందిన 100కి పైగా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. రూ.79.56 కోట్ల విలువైన ఉల్లిపాయలు, వాణిజ్య సరుకులు కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలను సృష్టించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుల ఫిర్యాదుతో ఈరోడ్ క్రైమ్ బ్రాంచ్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరిపి, సంస్థ యజమాని నవీన్ కుమార్, అతని సహచరుడు ముత్తుసెల్వంను అరెస్ట్ చేశారు. ఘ
ఇదీ చతవండి: నెలకు రూ.లక్ష సంపాదిస్తేనే బెంగళూరులో జీవితం


