అమెరికాలోని వలసదారులపై ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఫెడరల్ ఏజెంట్ల చర్యల వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయినప్పటికి వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా భారత సంతతికి చెందిన ఓ వృద్ధురాలికి చేదు అనుభవం ఎదురైంది.
ఆమె పట్ల ఐస్ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె డాక్టర్ నిషా పటేల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నిషా పటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తల్లి టెక్సాస్‌లోని ఒక అవుట్‌లెట్ మాల్‌లో షాపింగ్ చేస్తుండగా, మాస్క్‌లు ధరించిన ఐస్ ఏజెంట్లు తన దగ్గరకు వచ్చి విచారించారు.
ఆమెను చూసి మాట్లాడుతుందని భావించిన ఏజెంట్లు.. తొలుత ఆ భాషలోనే మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే సదరు మహిళ తనకు స్పానిష్ రాదని చెబడంతో, అయితే ఎక్కడ నుంచి వచ్చావు అంటూ పలు దేశాల పేర్లను చెప్పారు. అయితే ఐష్ ఏజెంట్లకు ఆమె గట్టిగానే సమాధానమిచ్చింది.
"మీలో చాలామంది పుట్టకముందు నుంచే నేను ఈ దేశంలో ఉంటున్నాను" ఆమె బదులు ఇచ్చింది. అయినప్పటికీ ఆమె తన ఫోన్‌లో ఉన్న యూఎస్ పాస్‌పోర్ట్ ఫోటోను చూపించే వరకు అధికారులు విడిచిపెట్టలేదు. కాగా నిషా పటేల్ తల్లి గత 47 ఏళ్లుగా అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆమెకు అక్కడి పౌరసత్వం కూడా ఉంది. అమెరికాలో ప్రస్తుతం అక్రమ వలసదారులను పట్టుకోవడానికి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని నిషా పటేల్ ఆవేదన వ్యక్తం చేసింది.


