
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్పై కాల్పులు జరిపారు. కెనడాలోని ఆయన కేఫ్పై గుర్తు తెలియని వ్యక్తి గన్తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేఫ్ను కపిల్ శర్మ ఇటీవలే ప్రారంభించినట్లు తెలుస్తోంది. కారులో వచ్చిన గుర్తు తెలియిని వ్యక్తి కాల్పులు జరపినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. కపిల్ శర్మను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందా? కేఫ్ టార్గెట్‌గా చేశారా? అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను రితేష్ లఖి అనే జర్నలిస్ట్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. కాగా.. కపిల్ శర్మ ఇటీవల కెనడాలోని సర్రేలో మూడు రోజుల క్రితమే కాప్స్ అనే పేరుతో కేఫ్‌ను ప్రారంభించారు. ఈ కాల్పుల ఘటనపై ఘటనపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
World Famous comedian Kapil Sharma's newly inaugurated restaurant KAP'S CAFE shot at in Surrey, BC, Canada last night.
Harjit Singh Laddi, a BKI operative, NIA's (INDIA ) most wanted terrorist has claimed this shoot out citing some remarks by Kapil@SurreyPolice pic.twitter.com/p51zlxXbOf— Ritesh Lakhi CA (@RiteshLakhiCA) July 10, 2025