
పేరుకే ఆడమగ సమానం అని చెప్పినప్పటికీ, సమాజంలో చాలా చోట్ల ఇప్పటికీ పురుషాధిక్యత కొనసాగుతోంది. కొన్ని పనులు, ముఖ్యంగా గృహసంబంధిత బాధ్యతలు, సంతాన సంరక్షణ వంటివి స్త్రీలు మాత్రమే చేయాలనే సాంప్రదాయ ఆలోచనలు ఇంకా బలంగా ఉన్నాయి. సంప్రదాయం పేరుతో వారిని అణచివేసే కార్యక్రమాలు చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక నటుడు మాత్రం స్త్రీలను గౌరవించాలని మాటలు మాత్రమే చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్నాడు. ప్రతి రోజు రాత్రి తన సతీమణి పాదాలకు నమస్కరించిన తర్వాతే నిద్ర పోతాడట. తన కష్టసమయాల్లో తోడుగా నిలిచిన సతీమణికి ఇలా పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని గర్వంగా చెబుతున్నాడు.
ఆ నటుడు మరెవరో కాదు..‘రేసుగుర్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన రవి కిషన్(Ravi Kishan). తాజాగా ఆయన ఓ సినిమా ప్రమోషన్ కోసం ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హోస్ట్ కపిల్ శర్మ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ‘రవి ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు భార్య ప్రీతి కిషన్ పాదాలను నమస్కారం చేస్తాడు’ అని చెప్పగా.. దీనికి రవి నవ్వుతూ అంగీకరించాడు.
‘మీరు చెప్పింది నిజమే. ప్రతి రోజు రాత్రి నా భార్య పాదాలకు నమస్కారం చేస్తా. ఆమెకు ఇలా చేయడం నచ్చదు. అందుకే నిద్రపోయిన తర్వాత ఆమె పాదాలను తాకుతా. నా జీవితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా భార్య ఎంతగానే అండగా నిలిచింది. డబ్బు, పలుకుబడి లేనప్పుడు కూడా నా పక్కనే నిలబడింది. ఇప్పుడు నేను ఈ స్థానంలో ఉన్నానంటే కారణం నా భార్య మాత్రమే. అంత చేసిన ఆమెకు నేను ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలను. అందుకే కనీసం పాదాలను తాయి అయినా కృతజ్ఞతతలు తెలపాలనుకున్నా’ అని రవి కిషన్ ఎమోషనల్ అయ్యాడు. రవి కిషన్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం, ఆమె పట్ల చూపే గౌరవాన్ని చాటడం అందరినీ ఆకట్టుకుంది.
కాగా, రవి, ప్రీతిల వివాహం 1993లో జరిగింది. వీరికి నలుగురు సంతానం. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయంగానే దూసుకెళ్తున్నాడు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. రేసుగుర్రం సినిమాలో విలన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయయ్యాడు. బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్ సినిమాలోనూ కీలక పాత్ర పోషించాడు.