టాలీవుడ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్ వరించింది. ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాజాగా ఈ అవార్డ్‌ను నిర్మాత అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ చేతుల మీదుగా తీసుకున్నారు.
కాగా.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో టీజీ విశ్వప్రసాద్ ఒకరు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా ఉన్నారు. ఇటీవలే ఈ బ్యానర్‌లో ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా రిలీజైంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అభిమానుల అంచనాలు ది రాజాసాబ్ అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, రిద్ధికుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.
Deeply honoured and humbled to share that our Producer @vishwaprasadtg garu has been awarded the West Bengal Governor’s Award of Excellence 🤗
Our heartfelt gratitude to the Hon’ble Governor of West Bengal, Dr. C. V. Ananda Bose ji, for this prestigious recognition bestowed upon… pic.twitter.com/c9mgUz28Jc— People Media Factory (@peoplemediafcy) January 29, 2026


