సాక్షి,తాడేపల్లి: ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహానీయుడు.. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి (మార్చి16) నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములుగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. నేడు శ్రీ పొట్టిశ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములుగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. నేడు శ్రీ పొట్టిశ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/KWE9EpRC9X
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2026


