నువ్‌ మోసపోయావ్‌.. వదిలేయ్‌ | Janasena Leader Thathamsetty Nagendra Reacts on MLA Arava Sridhar incident | Sakshi
Sakshi News home page

నువ్‌ మోసపోయావ్‌.. వదిలేయ్‌

Jan 28 2026 6:59 AM | Updated on Jan 28 2026 7:08 AM

Janasena Leader Thathamsetty Nagendra Reacts on MLA Arava Sridhar incident

సాక్షి, అమరావతి :  ‘‘ఇంక నిన్ను వాళ్లు కలుపుకోరు.. నువ్‌ మోసపోయావ్‌.. అయ్యిందేదో అయ్యింది.. నువ్‌ సర్దుకుపోవడం మంచిది’ అంటూ రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే బాధిత మహిళతో కూటమి పార్టీ నేత తాతంశెట్టి నాగేంద్ర చెప్పిన మాటలివి. ఎమ్మెల్యే అరాచకాలు బయటకు రాకుండా ఆపేందుకు తెర వెనుక కూటమి నాయకులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా అదే ప్రాంతానికి చెందిన కూటమి స్థానిక నేత తాతంశెట్టి నాగేంద్ర స్వయంగా బాధితురాలికి నాలుగు రోజుల క్రితం ఫోన్‌ చేసి మాట్లాడారు. శ్రీధర్‌ ఇంటిలో ఒప్పుకోవడం లేదని, జరిగింది మరచిపోయి సర్దుకుపోవాలని సలహా ఇచ్చారు. 

ఇంకా అతనే కావాలని వెళితే మళ్లీ మళ్లీ మోసపోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నీ కొడుకు కోసం అన్నీ వదిలేసి ముందుకు వెళ్లిపోవాలంటూ సలహా ఇచ్చారు. నిన్ను దూరం చేసుకుంటున్నందుకు ఎమ్మెల్యే బాధ పడతారని తాను అనుకోవడం లేదని నాగేంద్ర అన్నారు. బెంగళూరులో తన కుమారుడు చదివే కాలేజీ అమ్మాయిలతోనూ ఎమ్మెల్యే శ్రీధర్‌ ఫ్లర్ట్‌ (లోబరుచుకునే ప్రయత్నం) చేశారని, ఆ విషయం తన కుమారుడి ద్వారా తెలిస్తే తాను ఆ విషయం బయటకు రాకుండా సర్ధి చెప్పానని ఆయన కొత్త విషయాన్ని బయటపెట్టారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement