సాక్షి, ఢిల్లీ: జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్‌పై స్పందించేందుకు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరాకరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన్ని.. బుధవారం మీడియా ప్రతినిధులు పలకరించారు. అయితే చాలా అంశాలపై మాట్లాడిన ఆయన.. శ్రీధర్ అంశంపై స్పందించమని మీడియా ప్రతినిధులు కోరారు. అయితే ఆయన నోరు విప్పలేదు. సైలెంట్‌గా మొహం చాటేసుకుని కారెక్కి వెళ్లిపోయారు.
ఈ వ్యవహారంలో అరవ శ్రీధర్‌పై సస్పెన్షన్ వేటు పడిందని నిన్నంతా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అదంతా జన సైనికుల అత్యుత్సాహం అని తర్వాతే తేలింది. రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు అరవ శ్రీధర్‌ను రక్షించే ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా.. కేవలం విచారణ కమిటీ పేరిట తతంగం నడిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


