సాక్షి,చిత్తూరు: ‘జనసేన అంటే కామ సేన.. కామాంధుల సేన’అని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు.
మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేసిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆర్ కే రోజా, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డితో పాటు ఇతర పార్టీ నేతలు నిరసన చేపట్టారు. కీచక ఎమ్మెల్యేని శిక్షించాలని డిమాండ్ చేస్తూ..నగరి ఏ.జె.ఎస్ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. జనసేన అంటే కామ సేన.. కామాంధుల సేన.క్యారెక్టర్ లేనివాళ్లతో రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి నాయకులుంటే ప్రజలకు విలువ ఉండదు. మహిళకు అన్యాయం జరిగితే.. న్యాయం చేయరు. రైల్వేకోడూరులో బాధితురాలికి న్యాయం చేయాలి. రాష్ట్ర హోంమంత్రిని సస్పెండ్ చేయాలి’అని డిమాండ్ చేశారు.


