వాటర్‌ ట్యాంకులో డీజిల్.. ఇలా చేస్తే ఎలా? | Man Filling Thousands Of Litres Of Fuel In Water Tanker Amid West Asia Crisis Sparks Outrage, Check More Details Inside | Sakshi
Sakshi News home page

వాటర్‌ ట్యాంకులో డీజిల్.. ఇలా చేస్తే ఎలా?

Mar 12 2026 7:34 AM | Updated on Mar 12 2026 12:35 PM

 man filling thousands of litres of fuel in water tanker

పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు దేశాన్ని తాకాయి. ఇదివరకే వంటగ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా పలు హోటళ్లు, రెస్టారెంట్‌లు మూతబడ్డాయి. ఇక తదుపరి క్రూడాయిల్ కొరత ఏర్పడనుందేమో అనే భయంతో ఒక వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా వాటర్‌ ట్యాంకర్‌ నిండా డీజిల్ నింపుకెళ్లారు. ‌ దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ నిర్భందించడంతో చమురు నౌకల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇదివరకే దేశంలో వంటగ్యాస్, LPG, CNG కొరత ఏర్పడింది. అయితే ప్రభుత్వం వీటికి ఇబ్బందులు ఏమి లేవని సదరు సంస్థలను ఉత్పత్తి పెంచమని ఆదేశించామని ప్రకటించింది. అదేవిధంగా పెట్రోల్‌, డీజిల్ నిల్వలు సైతం రెండు మాసాలకు సరిపడా ఉన్నాయని ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు రవాణా చేపడుతున్నామని ప్రకటించింది. అయితే ఇలా ప్రకటించినటప్పటికీ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వేల లీటర్లు నిల్వ చేసి ఇతరులను ఇబ్బందులకు గురిచేసే యత్నం చేస్తున్నారు.

తాజాగా దానికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఒక వ్యక్తి నీటిని నిల్వచేసే ఒక ట్యాంకర్‌లో డీజీల్‌ నింపి నిల్వచేస్తున్నారు. దేశంలో డీజీల్ కొరత ఏర్పడే  అవకాశం ఉందనే ఈ విధంగా చేస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ వ్యక్తి దాదాపు ఐదువేల లీటర్ల డీజీల్ నిల్వ ఉంటుందని అది దాదాపు రెండువందల మందికి సరిపోతుందని అంటున్నారు. అయితే పెట్రోల్, డీజీల్ కొరత వదంతులతో చాలా మంది టౌన్‌లలో, గ్రామాలలో ఇదేవిధంగా చేస్తున్నారని దీనివల్ల పెట్రోల్‌, డీజిల్ కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా చేయడం వల్ల కొరత ఏర్పడడమే కాదని ఇది చాలా ప్రమాదమన్నారు. సీసాలలో ఆయిల్ తీసుకెళ్లడానికి అనుమతించని దేశంలో ట్యాంకర్లలో ఎలా నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి 5 వేల లీటర్లు తీసుకుంటే ఇక చమురుకొరత రాకుండా ఏలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసి ఆ పెట్రోల్‌ బంక్‌ లైసెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement