బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా సైన్యం ఆదివారం తొలిసారిగా బాంబర్ పెట్రోలింగ్ నిర్వహించింది. ఇందుకోసం ఏకంగా యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఫైటర్ జెట్లు సముద్రంపై గగనతలంలో చక్కర్లు కొట్టాయి. ఫిలిప్పైన్స్‌కు హెచ్చరికగానే బాంబర్ పెట్రోలింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఫిలిప్పైన్స్ నావికాదళం ఇటీవల అమెరికా, జపాన్ సైన్యంతో కలిసి దక్షిణ చైనా సముద్రంలో ఉమ్మడిగా సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ పరిణామం చైనాకు రుచించడం లేదు. దక్షిణా చైనా సముద్రం మొత్తం తమదేనని చైనా ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై ఫిలిప్పైన్స్, వి యత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. చైనా ఆధిపత్య ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.


