
అతనో ట్రాఫిక్ కానిస్టేబుల్.. ప్రభుత్వం కేటాయించిన బ్యాటరీ సైకిల్‌పై విధులు నిర్వహిస్తూ సికింద్రాబాద్ ప్రజల మన్ననలు పొందుతున్నాడు.. సంధులు, గల్లీల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయనే సికింద్రాబాద్ మహంకాళి ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఎండీ జకీయుద్దీన్.
2014 బ్యాచ్‌కు చెందిన జకీయుద్దీన్ ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు..స్టేషన్ పరిధిలోని మోండా మార్కెట్, పాట్ మార్కెట్, ఓల్డ్‌గాస్ మండీ తదితర ప్రాంతాల్లో సైకిల్‌పై విధులు నిర్వహిస్తున్నాడు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వం బ్యాటరీ సైకిళ్లను అందజేసింది. అయితే చాలా స్టేషన్లలో వీటిని మూలనపడేశారు.
విధుల కోసం డిపార్టుమెంట్ ప్రతి నెలా ఇచ్చే 25 లీటర్ల పెట్రోల్‌తో బైక్స్ వినియోగిస్తుంటారు.. అయితే ఇంధనం ఆదా చేయడంతో పాటు వాహన కాలుష్యాన్ని తగ్గించడానికే తాను బ్యాటరీ సైకిల్ వినియోగిస్తున్నానని జకీయుద్దీన్ చెబుతున్నాడు. తాను క్రీడాకారుడిని కాబట్టి సైకిల్ వినియోగం ఆరోగ్యానికీ ఉపయుక్తమవుతుందని, పర్యావరణానికీ మేలు కలుగుతుందని సాక్షితో పంచుకున్నాడు.
(చదవండి: ఈ బామ్మ రూటే సెపరేటు..! వందో పుట్టినరోజుని అందరిలా కాకుండా..)