breaking news
Jaish-e-Mohammed chief Masood Azhar
-
ఘోస్ట్ ఎంట్రీ!
సుశిక్షితులైన వేలాది మంది సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారంటూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (జేఈఎం) చీఫ్ మసూద్ అజర్ చేసిన ప్రసంగం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఉగ్రవాది కొన్నేళ్ల క్రితం కశ్మీర్లో అరెస్టు అయ్యాడు. ఇతడిని విడిపించడానికే ‘కాందహార్ హైజాక్’గా పిలిచే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 814 విమానం హైజాక్ జరిగింది. అజహర్ జైల్లో ఉండగా ఏర్పడిన పరిచయాలతోనే కోల్‌కతాలో ఖాదిమ్స్ సంస్థ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ కిడ్నాప్ జరిగింది. బర్మన్ను విడుదల చేయడానికి డిమాండ్ చేసిన రూ.3 కోట్లు హైదరాబాద్ నుంచే చేతులు మారాయి. ఈ మొత్తం నుంచి రూ.కోటి అమెరికాలో జరిగిన 9/11 దాడుల కోసం వినియోగించారు. బర్మన్ కిడ్నాప్‌లో పాల్గొన్న ముఠా నుంచే కాలక్రమంలో దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పుట్టింది. గోకుల్‌చాట్– లుంబినీ లేజేరియంల్లో 2007, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్‌ల్లో 2013ల్లో జరిగిన విధ్వంసాలకు పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థే. ఈ ఎపిసోడ్స్ అన్నింటికీ మూలం– అజహర్ మసూద్ భారత్ రావడం, తిరిగి వెళ్లడమే!పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న బహవల్పూర్కు చెందిన ముహమ్మద్ మసూద్ అజర్ అల్వీ అక్కడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కుమారుడు. పాఠశాల విద్యను ఎనిమిదో తరగతిలోనే వదిలేసిన ఇతగాడు కరాచీలోని ఇస్లామిక్ యూనివర్సిటీ జామియా ఉలూమ్–ఉల్–ఇస్లామియాలో చేరాడు. 1989లో ఆలీమ్‌గా పట్టభద్రుడై ఓ మదర్సాలో ఉపాధ్యాయుడిగా మారాడు. పాకిస్తాన్‌కు చెందిన జిహాదీ గ్రూప్ హర్కత్ ఉల్ అన్సారీ అప్పట్లో అఫ్గానిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో జిహాదీ శిక్షణ శిబిరాలు నిర్వహించింది. ఇలాంటి ఓ శిబిరంలో చేరిన మసూద్ ఆ శిక్షణ పూర్తి కాకుండానే సోవియట్–అఫ్గాన్ యుద్ధంలో పాల్గొన్నాడు. తీవ్రంగా గాయపడి పాకిస్తాన్ చేరిన అజర్ హర్కత్‌లో యువత చేరేలా ప్రేరేపించే విభాగాన్ని పర్యవేక్షించాడు. ఆపై పాకిస్తాన్‌కే చెందిన ఉగ్రవాది ఫజల్ ఉర్ రెహ్మాన్ ఏర్పాటు చేసిన హర్కత్ ఉల్ ముజాహిదీన్‌లో (హెచ్‌యూఎం) చేరాడు. ఇక్కడే అజర్ భారత్‌లోకి రావడానికి మార్గం ఏర్పడింది. అప్పట్లో కశ్మీర్లో వేర్పాటు వాదాన్ని ప్రేరేపించిన ఉగ్రవాద సంస్థ హర్కత్–ఉల్–అన్సార్‌లో విభేదాలు ఏర్పడతాయి. దీంతో ఇది హర్కత్–ఉల్–జిహాద్ అల్–ఇస్లామీ, హర్కత్–ఉల్–ముజాహిదీన్ అనే రెండు గ్రూపులుగా మారింది. వీరి మధ్య స్పర్థలు 1993లో తారస్థాయికి చేరాయి. ఫలితంగా కశ్మీర్లో తన ఆపరేషన్స్ కుంటుపడ్డాయని హర్కత్ ఉల్ అన్సార్ భావించి, ఈ గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలను అజర్‌కు అప్పగించింది. దీంతో 1994లో పోర్చుగీస్ పాస్‌పోర్టు తీసుకున్న అజర్, నేరుగా ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్, అయోధ్య సహా అనేక ప్రాంతాల్లో తిరిగాడు. చివరకు కశ్మీర్ చేరుకుని రెండు గ్రూపుల మధ్య సమావేశాలు ఏర్పాటు చేసి సయోధ్య కుదిర్చాడు. అత్యంత కీలక ఉగ్రవాది అయిన అజర్‌కు హర్కత్–ఉల్–అన్సార్ సంస్థ కశ్మీర్లో ఓ గన్‌మెన్‌ను కేటాయించింది. అజర్ అదే ఏడాది ఫిబ్రవరి 11న ఓ కారులో హెచ్‌యూఎం చీఫ్ కమాండర్ సజ్జద్ అఫ్గానీ, తన గన్‌మ్యాన్‌తో కలిసి కారులో ప్రయాణిస్తుంటే, అనంత్‌నాగ్‌లోని కనాబాల్ చౌక్ వద్ద కారు పాడయింది. దీంతో అక్కడ నుంచి వీళ్లు ఆటోలో బయలుదేరారు. ఆటో అక్కడి కప్రాన్ అటవీ ప్రాంతం వద్దకు చేరుకునే సమయానికి జమ్మూ–కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా వాహన తనఖీలు నిర్వహిస్తున్నాయి. అక్కడ అది నిత్యం జరిగేదే అయినా, హడావుడి చూసి భయపడిన అజర్ గన్‌మ్యాన్ తుపాకీతో కాలుస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఆర్మీ అప్రమత్తమై అతడితో పాటు అజర్, సజ్జద్‌లను అదుపులోకి తీసుకుంది. శ్రీనగర్ తరలించి విచారణ ప్రారంభించింది. తొలుత వీరితో పాటు స్థానిక పోలీసులూ అజర్‌ను సాధారణ వేర్పాటువాదిగా భావించారు. కొందరు అనుమానితులు పట్టుబడిన విషయం శ్రీనగర్ చేరుకునే ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) టీమ్ చేపట్టిన విచారణలోనే అజర్ పూర్వాపరాలు బయటకు వచ్చాయి. దీంతో అరెస్టు చేసిన పోలీసులు కొన్నాళ్లు జమ్మూలోని కోట్ భల్వాల్ జైలులో ఉంచి, తర్వాత ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. అజర్‌ను విడిపించడం హర్కత్–ఉల్–అన్సార్ సంస్థ ఇల్యాస్ కశ్మీరీ, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్‌లను రంగంలోకి దింపింది. ఈ ద్వయం 1994లోనే ‘ఆపరేషన్ అల్–హదీద్’ పేరుతో ప్రత్యేక ఉగ్రవాద చర్య చేపట్టింది. ఢిల్లీలో ఇద్దరు గైడ్స్‌తో పాటు నలుగురు విదేశీ పర్యాటకులను అపహరించి, నిర్బంధించింది. వారిని సురక్షితంగా విడుదల చేయడానికి మసూద్ అజర్ సహా మరికొందరు ఉగ్రవాదుల్ని వదలాలంటూ షరతు విధించింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు వీరి స్థావరంపై దాడి చేశాయి. ఫలితంగా ఒమర్ సయీద్ షేక్ గాయపడి చిక్కగా, ఇల్యాస్ కశ్మీరీ తప్పించుకుని పారిపోయాడు. బందీలుగా ఉన్న టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీ పోలీసులు ఒమర్ సయీద్ షేక్‌ని కూడా తీహార్ జైలుకు తరలించింది. (తీహార్ జైలు నుంచే మరో కథ మొదలైంది. అక్కడే తరచు కలుసుకున్న అజర్, ఒమర్ సయీద్ షేక్ సాధారణ కొందరు నేరగాళ్లను ఉగ్రవాదం వైపు మళ్లించారు. వీళ్లే ఖాదిమ్స్ సంస్థ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ను కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన ‘పార్ట్–2 ‘జైల్ టు జీహాద్’ వచ్చే వారం) -
'ఒకరు కాదు.. వెయ్యి మంది కాదు.. భారత్‌కు మసూద్ అజార్ హెచ్చరికలు
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్‌కు సంబంధించిన ఒక ఆడియో వెలుగులోకి వచ్చింది. తన వద్ద భారీ సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ బాంబర్లు’’ ఉన్నాయంటూ ప్రకటించారు. వారు ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించాడు. భారత్‌పై దాడులు చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది.‘‘ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వెయ్యి మంది కాదు. వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు దాడికి సిద్ధంగా ఉన్నారు. వారు భారత్‌లోకి చొరబడటానికి అనుమతించాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను మొత్తం సంఖ్యను బహిరంగంగా తెలియజేస్తే ప్రపంచం షాక్ అవుతుంది’’అని ఆడియోలో ఉంది. ఈ ఉగ్రవాదులు దాడులకు పాల్పడి, అమరవీరులు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నా అజార్.. ఈ వ్యక్తులు తమ లక్ష్యాన్ని సాధించడానికి, తమ దృష్టిలో షహాదత్ (మరణం ద్వారా మతపరమైన గౌరవం) పొందడానికి అత్యంత ఉత్సాహంగా ఉన్నారంటూ పేర్కొన్నారు. అయితే, ఆడియో రికార్డింగ్ ఎప్పటిది? నిజమా? కాదా? అనేది నిర్థారణ కాలేదు.ఆపరేషన్ సిందూర్‌లో జైషే మమ్మద్ స్థావరం పూర్తిగా నేలమట్టమైన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజహర్ కుటుంబలో 14 మంది మృతి చెందారు. మసూజ్ అజహార్ సోదరి,బావ, మేనల్లుడు సైతం ఉన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అధినేత మసూద్ అజార్ లేఖ విడుదల చేశారు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు. ఆపరేషన్ సిందూర్‌పై నాకు భయం లేదు. నిరాశ లేదు. విచారం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, భారత్‌ను నాశనం చేస్తానంటూ లేఖలో ఓవరాక్షన్ చేశారు.కాగా, భారత్‌లో ఇప్పటివరకూ జరుగుతూ వచ్చిన ఉగ్రదాడుల వెనుక మసూద్ అజార్‌ది కీలక పాత్ర. 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులతో సహా అనేక ఉగ్రదాడులకు ఇతను సూత్రధారిగా ఉన్నాడు. 2016లో పఠాన్‌కోట్‌లో ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడితో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనలో కూడా మసూద్ అజార్ ‘పాత్ర ఉంది. ఆ నేపథ్యంలో భారత్ మోస్గ్ వాంటెడ్ ఉగ్రవాదిగా మసూద్ అజార్ ఉన్నాడు. -
జైషే మహ్మద్ ‘మహిళా గ్రూప్’
ఇస్లామాబాద్: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలమైన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్.. తిరిగి పుంజుకునేందుకు కొత్త వ్యూహాలు అమలుచేస్తోంది. అందులో భాగంగా తొలిసారి ఆ సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ప్రకటించింది. సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజహర్ పేరుతో విడుదల చేసిన లేఖలో.. జమాత్ ఉల్ మోమినాత్ పేరుతో మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. ఈ విభాగంలోకి ఈ నెల 8వ తేదీ నుంచి చేరికలు కూడా ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ విభాగానికి మసూద్ అజహర్ సోదరి సాదియా అజహర్ నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. గత మే నెల 7న ఆపరేషన సిందూర్‌లో భాగంగా పాక్‌లోని బహావల్పూర్లో ఉన్న జైషే ప్రధాన కార్యాలయంపై భారత్ వైమానికదళం క్షిపణుల వర్షం కురిపించటంతో సాదియా భర్త యూసుఫ్ అజహర్‌తోపాటు మసూద్ కుటుంబసభ్యులు పలువురు మరణించారు. ఉగ్రవాదుల భార్యలు, పేద యువతులే సభ్యులు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలో పనిచేస్తున్న పురుష ఉగ్రవాదుల భార్యలను ఈ మహిళా విభాగంలోకి చేర్చుకుంటున్నట్లు తెలిసింది. బహావల్పూర్, కరాచి, ముజఫరాబాద్, కోట్లి, హరిపూర్, మాన్సేహ్రాలోని ఉగ్ర సంస్థ కేంద్రాల్లో చదువుకుంటున్న పేద యువతులను కూడా ఈ గ్రూపులో చేర్చుకుంటున్నట్లు సమాచారం. భారత్‌కు వ్యతిరేకంగా జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సిద్ధాంతాన్ని ప్రచారం చేయటమే జమాత్ ఉల్ మోమినాత్ ప్రధాన లక్ష్యమని తెలిసింది. సోషల్‌మీడియా ద్వారా పాకిస్తాన్‌తోపాటు భారత్‌లోని జమ్ముకశీ్మర్, ఉత్తరప్రదేశ్, మరికొన్ని ప్రాంతాల్లో యువతను ఈ గ్రూప్ ఉగ్రవాదంవైపు మళ్లించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు నిఘా వర్గాల సమాచారం. ఉగ్రవాద సంస్థలోకి భారీగా చేరికలను ప్రోత్సహించేందుకు ఈ మహిళా గ్రూప్ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఇప్పటివరకు మహిళలకు తమ సంస్థల్లో స్థానం కల్పించలేదు. జిహాద్ పేరుతో చేసే సాయుధ పోరాటాల్లో మహిళలకు స్థానం లేదని చెబుతూ వచ్చారు. కానీ, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ చావుదెబ్బ కొట్టడంతో జైషే మహ్మద్ తన విధానాన్ని మార్చుకుంది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న మసూద్ అజహర్, అతడి సోదరుడు తల్హా అల్ సైఫ్ ఇద్దరూ ఈ మహిళా విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. బహావల్పూర్లో భారత్ ధ్వంసం చేసిన జైషే ప్రధాన కార్యాలయాన్ని పునరి్నరి్మంచేందుకు ఆర్థికసాయం చేయనున్నట్లు ఇటీవలే పాక్ ప్రభుత్వం తెలిపింది. కాగా, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా పేరుపడ్డ ఐఎస్ఐఎస్, బోకోహరాం, హమాస్ల్లో మహిళా విభాగాలు ఉన్నాయి. ఈ మహిళలతో ఆయా సంస్థలు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ చరిత్ర ఉంది. -
మసూద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి
ఐక్యరాజ్యసమితి: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయాలని పేర్కొంటూ నేరుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి ఫ్రాన్స్, బ్రిటన్లు మద్దతు తెలిపాయి. చాలా శక్తిమంతమైన భద్రతామండలిలో నేరుగా అమెరికా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మసూద్‌కు చెందిన ఆస్తులు జప్తు చేసేలా, అతడు ఎక్కడికీ ప్రయాణించకుండా నిషేధాజ్ఞలు విధించాలని అమెరికా కోరింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ స్పందించారు. ‘బలవంతంగా తీర్మానాన్ని ముందుకు జరపడం ఆపాలి. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాను కోరుతున్నాం’ అని అన్నారు. ఈ తీర్మానంపై ఎప్పుడు ఓటింగ్ జరుగుతుందనే విషయంపై స్పష్టతలేదని ఐరాస వర్గాలు చెబుతున్నాయి. 15 మంది (10+5) సభ్యులున్న భద్రతామండలిలో తీర్మానం పాస్ కావాలంటే తొమ్మిది ఓట్లు కావాలి. అయితే శాశ్వత సభ్య దేశాలైన చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు అడ్డుకుంటూ ఒక్క వీటో కూడా వేయొద్దు. అప్పుడే ఆ తీర్మానానికి ఆమోద ముద్ర పడుతుంది. ఈసారి కూడా ఎప్పటిలాగే చైనా తన వీటో అధికారంతో ఈ తీర్మానాన్ని అడ్డుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. అల్‌ఖైదా ఉగ్రసంస్థతో మసూద్‌కు సంబంధాలు ఉన్నాయని, ఆర్థికంగా, ప్రణాళికలు రచించడంలో, ఆయుధాల సరఫరా చేయడంలో మసూద్ సహాయం అందిస్తున్నాడని, జైషేమహ్మద్‌కు సహాయసహకారాలు అందిస్తున్నాడని తీర్మానంలో అమెరికా పేర్కొంది. -
మసూద్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టండి : అమెరికా
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి(ఐరాస) అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మరో అడుగు ముందుకేశాయి. ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. రెండు వారాల క్రితమే అమెరికా ప్రతిపాదనను తన వీటో అధికారంతో చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల సహకారంతో అమెరికా.. ఐక్యరాజ్య సమితిలో అజర్ నిషేధంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భద్రతా మండలిలో ఉన్న 15 సభ్యదేశాలకు బ్రిటన్, ఫ్రాన్స్ సంతకం చేసిన తీర్మానాన్ని అమెరికా సర్క్యూలేట్ చేసింది. అజర్‌పై ట్రావెల్ బ్యాన్ విధించాలని, అతని ఆస్తులను స్తంభింపచేయాలని కోరింది. మళ్లీ చైనా అడ్డుపుల్ల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనపై కారణాలను సాకుగా చూపుతూ భద్రతామండలిలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా నాలుగోసారి అడ్డుకుంది. దీంతో ఈ సారి కచ్చితంగా అజహర్‌ను నిషేదించేలా అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల జరిగిన పుల్వామాలో దాడిలో తమ పాత్ర ఉనట్లు జైషే అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఉగ్రవాదిపై నిషేధం విధించేందుకు అగ్ర రాజ్యం అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. -
ఓపిగ్గా వ్యవహరిస్తాం
న్యూఢిల్లీ/వాషింగ్టన్/న్యూయార్క్: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి(ఐరాస) అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో ఓపిగ్గా వ్యవహరిస్తామని భారత్ తెలిపింది. అయితే ఉగ్రవాదంపై పోరాటం విషయంలో ఎక్కడా రాజీపడబోమని స్పష్టం చేసింది. పాక్ భూభాగంలో ఆశ్రయం పొందుతున్న కొన్ని ఉగ్రసంస్థలు చైనా ప్రయోజనాలకూ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని గుర్తుచేసింది. ఇటీవల సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ భద్రతామండలిలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా నాలుగోసారి అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్–పాకిస్తాన్ల మధ్య మరే దేశమయినా మధ్యవర్తిత్వం చేయొచ్చన్న వాదనలను తోసిపుచ్చారు. మసూద్ అజహర్ విషయంలో చైనా మెతకవైఖరి నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దౌత్యాధికారులు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయమై చైనా ప్రతినిధులతో చర్చలు ప్రారంభించారు. మసూద్‌ను చైనా భద్రతామండలిలో కాపాడటంపై అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తన సంపాదకీయంలో ఘాటుగా విమర్శించింది. -
మోదీ బలహీనమైన వ్యక్తి..
-
‘మోదీకి అతనంటే చాలా భయం’
న్యూఢిల్లీ : మోదీ బలహీనమైన వ్యక్తి.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘బలహీనమైన మోదీ షీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారు. భారత ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంటే.. మోదీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. చైనాతో నమో(నరేంద్రమోదీ) దౌత్య సంబంధం ఎలా ఉంటుందంటే.. మోదీ జిన్‌పింగ్‌తో కలిసి గుజరాత్లో పర్యటిస్తారు.. ఢిల్లీలో జిన్‌పింగ్‌ను కౌగిలించుకుంటారు.. చైనాలో జిన్‌పింగ్ ముందు తలవంచుతారు’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సభ్యదేశాలు పది పని దినాల్లోగా లేవనెత్తాలి. దీనికి బుధవారంతో గడువు ముగిసింది. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీగిపోయింది. ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. (మళ్లీ చైనా అడ్డుపుల్ల) -
మళ్లీ చైనా అడ్డుపుల్ల
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుతగిలింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సభ్యదేశాలు పది పని దినాల్లోగా లేవనెత్తాలి. దీనికి బుధవారంతో గడువు ముగిసింది. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీగిపోయింది. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. గతంలోనూ భారత్ యత్నాలను చైనా అడ్డుకుంది. చైనా నిబంధల ప్రకారమే నడుచుకుంటుందని, అజహర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసే ప్రయత్నాలను అడ్డుకోబోతున్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి లు కాంగ్ అంతకుముందే సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసేందుకు అజహర్ తగిన వ్యక్తేనని అమెరికా పేర్కొంది. తాజా పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..భారత పౌరులపై దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్ని అనుసరిస్తామని ప్రకటించింది. తమ ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుపడటంపట్ల విచారం వ్యక్తం చేసింది. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న తమ ప్రతిపాదనకు మద్దతు పలికిన అమెరికా, ఫ్రాన్స్, యూకేలకు కృతజ్ఞతలు తెలిపింది. -
జైషే చీఫ్ మసూద్‌పై రెడ్ కార్నర్ నోటీసు
న్యూఢిల్లీ : పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి, జైషే ఈ మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కు ఇంటర్ పోల్ మంగళవారం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మసూద్ తో పాటు అతడి సోదరుడు అబ్దుల్ రవూఫ్‌లపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది. అలాగే ఇంటర్‌పోల్ ఈ కేసులో మరో ఇద్దరు షాహిద్ లతిఫ్, ఖషీఫ్ జాన్‌పై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే యోచనలో ఉంది. ఈ ఏడాది జనవరి 2వ తేదీన పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులు, ఏడుగురు కమెండోలు మృతి చెందారు. ఇక పాకిస్థాన్‌లో ఉంటూనే ఈ దాడికి సూత్రధారిగా వ్యవహరించిన మసూద్ అక్కడి నుంచే ఉగ్రవాదులను పంపాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో తేల్చింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంటును సీబీఐ ఇంటర్ పోల్ కు పంపి వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా కోరింది. దీనిపై స్పందించిన ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది.


