సాక్షి కడప: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటన గురువారం ముగిసింది. పులివెందులలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఉదయం ఆయన బయలుదేరి వెళ్లారు. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ తొలిరోజు పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలు, పార్టీ నాయకులతో మమేకమయ్యారు.
రెండో రోజు పులివెందుల పరి«ధిలోని బ్రాహ్మణపల్లె సమీపంలో అరటి తోటలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. పలువురు నేతలను పరామర్శించడంతోపాటు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మూడోరోజు కూడా ఇల్లు, కార్యాలయం వద్ద వేచి ఉన్న ప్రజలతో మమేకమయ్యారు.


