రాజయ్యపేట మత్స్యకారులకు వైఎస్సార్‌సీపీ నేతల మద్దతు..
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కామెంట్స్..
- మత్స్యకారులు వారికి జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్‌కు వివరించారు.
- వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చాము..
- ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలి..
- ప్రజల ప్రాణాలు తియ్యడానికి కాదు.
- ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పెట్టాలి?.
- ఎన్నికలకు ముందు క్యాన్సర్, పిల్లలకు అంగవైకల్యం వస్తుందని అనిత చెప్పారు
- అనితకు ఇది న్యాయమా?.
- ప్రజల పక్షాన ఉంటాం..
- బల్క్ డ్రగ్ పార్క్‌ను ఏర్పాటు కానివ్వం.
- రాజయ్యపేట పర్యటనపై అనేక ఆంక్షలు పెట్టారు..
- మేము ఏమైనా సంఘ విద్రోహ శక్తులమా?
- రాజయ్యపేట గ్రామస్తుల ఆధార్ కార్డులు ఎందుకు అడుగుతున్నారు.
- వైఎస్ జగన్ మీ కోరికను నెరవేరుస్తారు.
- కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు మేము బాధ్యత వహిస్తాం.
- వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మీ మీద కేసులన్నీ తొలగిస్తారు..
- మానవత్వం లేకుండా కూటమి వ్యవహరిస్తోంది.
- మీతో పాటు మేము పోరాటం చేస్తాం..
- మీకు అండగా మేముంటాం.
- తప్పు చేసిన కూటమికి శిక్ష తప్పదు..
- మీరు చెప్పిన ప్రతి మాటను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తాం.

కురసాల కన్నబాబు కామెంట్స్..
- ఎన్నికలకు ముందు అనిత ఎన్నో హామీలు ఇచ్చారు.
- బల్క్ డ్రగ్ పార్కు వలన క్యాన్సర్ వస్తుందని చెప్పారు..
- చంద్రబాబుకు ఇచ్చిన హామీలు గుర్తు ఉండవు.
- పేదల పక్షాన వైఎస్ జగన్ నిలుస్తారు.
- కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ఎత్తేస్తారు.
- చంద్రబాబు పెద్దల పక్షం.. వైఎస్ జగన్ పేదల పక్షం.
- రాజయ్యపేట రాకుండా అనేక ఆంక్షలు పెట్టారు..
- ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు..
- పోలీసులు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోమనండి.
- వైఎస్ జగన్ సీఎం అయ్యాక కేసులన్నీ ఎత్తివేస్తారు..
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్..
- మీకు అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుంది.
- వైఎస్ జగన్ ఆదేశం మేరకు మీ దగ్గరికి వచ్చాము.
- రాజకీయం కోసం రాలేదు.
- మీకు సంఘీభావం తెలపడానికి వచ్చాము.
- మీ గ్రామంలోకి మీరు రావడానికి గతంలో ఎన్నడైనా ఆధార కార్డులు చూపించారా?.
- వందల ఏళ్ళుగా ఇక్కడే జీవిస్తున్నారు..
- కొన్ని రోజుల పోతే పాస్‌పోర్ట్ అడుగుతారు
బల్క్ డ్రగ్ పార్క్‌కు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం
అనితను నమ్మి మోసపోయాం: రాజయ్యపేట మత్స్యకారులు
- మత్స్యకారుల ఆవేదన..
- వైఎస్సార్‌సీపీ నేతలతో మత్స్యకారులు.
- నమ్మించి అనిత మోసం చేసింది.
- బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయమని అనిత చెప్పింది.
- మా ఊరి ఆడపిల్ల అని చెప్పింది.
- అనిత నమ్మి మా గ్రామం నుంచి 2000 మెజార్టీ ఇచ్చాము.
- మమ్మల్ని చంపి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయండి.
- మాకు జగనే న్యాయం చేయాలి.
- కూటమి వల్ల న్యాయం జరగదు.
- బల్క్ డ్రగ్ పార్క్ వలన మా జీవితాలు నాశనమవుతాయి.
- ఏం పాపం చేశామని మమ్మల్ని వేధిస్తున్నారు.
- మా ప్రాణాల పోయినా పర్వాలేదు.
- బల్క్ డ్రగ్ పార్కు కట్టనివ్వము.
వైఎస్సార్‌సీపీ నేతల సంఘీభావం..
- రాజయ్యపేట చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
- మత్స్యకారుల పోరాటానికి సంఘీభావం తెలిపిన వైఎస్సార్‌సీపీ నేతలు.
- మత్స్యకారులతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, కేకే రాజు, పార్టీ నాయకులు.
- వైఎస్సార్‌సీపీ నేతలకు తమ సమస్యలను విన్నవించుకున్న మత్స్యకారులు.
- మత్స్యకారుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైఎస్సార్‌సీపీ.
- నర్సీపట్నం పర్యటన సందర్భంగా వైఎస్ జగన్‌ని కలిసిన మత్స్యకారులు.
- ఉద్యమంలో పాల్గొని మత్స్యకారులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు.
👉పరిశ్రమల వ్యర్థాలు సముద్ర జలాలను కలుషితం చేస్తాయని, చేపల వేటపై ఆధారపడి బతుకుతున్న తమ పొట్ట కొడతాయని, తమ ఆవేదన అర్థం చేసుకోమని నెల రోజులకు పైగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. తొలి నుంచీ పార్టీ స్థానిక నేతలు ఆందోళనకారులకు మద్దతునిస్తుండగా.. అగ్ర నేతలు సైతం గ్రామానికి తరలివచ్చి సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించారు.
👉వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు బుధవారం ‘చలో రాజయ్యపేట’కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ కోరారు. కాసేపట్లో వైఎస్సార్‌సీపీ నేతలు రాజయ్యపేటకు చేరుకోనున్నారు. కాగా, బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు 39 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. వారి ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేస్తోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ నేతలు సంఘీభావం తెలుపనున్నారు. మరోవైపు.. రాజయ్యపేటలో పోలీసుల పహారా కొనసాగుతోంది.



