
సాక్షి, కాకినాడ: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు, రైతులు కచ్చింగా మోసపోతారని.. ఇలా మాయమాటలు చెప్పేవాళ్లను మోసగాళ్లు అనడంలో తప్పే లేదని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం వంగా గీత అధ్యక్షతన పిఠాపురంలో జరిగిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స పాల్గొని ప్రసంగించారు.
చంద్రబాబు అసలు సూపర్ సిక్స్ వాగ్ధానాలు ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయ్యరా?. అడిగితే మక్కెలు విగకొడతాం, తాట తీస్తాం అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలు తేరగా ఉన్నారా?. ఒక్కసారి గ్రామాల్లో తిరగండీ.. ఎవరికి మక్కెలు విరగకొడతారో తెలుస్తుంది.
మాయమాటలు చెప్పేవాళ్ళను మోసగాళ్ళని అనలా? వద్దా?. కూటమి అధికారంలోకి వచ్చి ఒక్క ఉద్యోగం ఇచ్చిందా?. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు, రైతులు మోసపోతారు. చంద్రబాబు వంద అబద్దాలు చెబితే.. లోకేష్ రెండు వందల అబద్దాలు చెబుతారు. ఏప్రిల్.. మే మాసంలో రైతులు అన్నదాత సుఖీభవ ఇస్తామని లోకేష్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఇప్పుడు ఏ నెల నడుస్తుందో రైతులు,ప్రజలు గుర్తించాలి. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంతో ప్రజల్లోకి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు వెళ్ళాలి అని బొత్స పిలుపు ఇచ్చారు.
పిఠాపురం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి వంగా గీతా మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాకు వెన్నంటే ఉన్నారు. ఏలేరు వరదల సమయంలో జగన్ వెంట జనం ఉన్నారు అని చూపించారు.
దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక వీదికో రెండు బెల్టు షాపులు పెట్టారు. నాణ్యమైన గంజాయి వ్యాపారం చేసి యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారు. చంద్రబాబు మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరు. చంద్రబాబు మాటలకు విలువలు..విశ్వసనీయత ఉండదు. అందుకే బాబు హమీలకు నాది భాధ్యత అని గత ఎన్నికల్లో పవన్ చెప్పారు. ఇద్దరు మాటలు విని రాష్ట్ర ప్రజలు మోసపోయారు.
ధాన్యాగారంగా ఉన్న పిఠాపురంలో ఇప్పుడు రైతుల పరిస్థితి ఏమిటీ?. నాలుగు సార్లు ముఖ్యమంత్రి గా చేసిన చంద్రబాబు.. ఇప్పటి వరకు కుప్పాన్ని...స్వర్ణ కుప్పం ఎందుకు చేయ్యలేదు. సుపరిపాలనలో తొలి అడుగుకు టీడీపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు.
జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అయిన తరువాత పిఠాపురం నియోజకవర్గం కు పవన్ ఎన్నిసార్లు వచ్చారు?. పిఠాపురం లో ప్రజల సమస్యల మీద ఒక్క క్షణం ఆలోచించే పరిస్ధితిలో లేరు. వాలంటీర్ల ద్వారా అదృశ్యమయ్యారని చెప్పిన పవన్.. మరి ఆ మహిళలను వెనక్కి తీసుకువచ్చారా?. కాపు సామాజిక వర్గంలో యువత పవన్ ను హీరోగా భావించి వెనుక తిరిగారు. వారంతా ఇప్పుడు తమను తాము ప్రశ్నించుకోవాలి. పవన్ ముఖ్యమంత్రి అవ్వడం కోసం పార్టీ పెట్టారా?. లేదంటే చంద్రబాబును ముఖ్యమంత్రి ని చేయ్యడానికి పార్టీని పెట్టారా? చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేయ్యాలని తాపత్రాయ పడే పవన్ ను హీరోగా చూడడం ఖర్మ.
వంగవీటి మోహన రంగా , ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళను కాపులు హీరోలుగా చూడాలి. సినిమాలో నాలుగు స్టెప్పులు వేసి..బయటకు వచ్చి మైక్ పట్టుకున్న వ్యక్తిని హీరోగా చూడడం దౌర్భాగ్యం. రానున్న రోజుల్లో పవన్ కల్యాణ్‌కు, వంగా గీతా కు మధ్య ఉన్న వ్యత్యాసం పిఠాపురం ప్రజలకు కచ్చితంగా తెలుస్తుంది. రాజకీయంగా జన్మనిచ్చిన పిఠాపురం లో పవన్ అంతం అయ్యేలా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలి.
తోట నరసింహం మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైఎస్ జగన్. దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా అనేక సంక్షేమ పధకాలు అమలు చేశారు. మేనిఫెస్టోను భగవత్ గీత,బైబిల్,ఖురాన్ గా ఆరాధించారు. మరో 15-20 ఏళ్ళు కూటమి కలిసే ఉంటుందని పవన్ అంటున్నారు. పిఠాపురం లోనే కూటమీకి బీటలు వారాయి. జెండాలతో.. కుర్చీలతో కూటమి నేతలు కొట్టుకుంటున్నారు.