breaking news
Recalling Chandrababus manifesto
-
మూడు కోతుల్లా మూసుకున్న బాబు, లోకేష్, పవన్
సాక్షి, ప్రకాశం: పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు ఏనాడూ లేదని.. ఈ పాలనలోనూ పేదపిల్లల చదువుకు మోకాలడ్డుపెడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, అందుకే మ్యానిఫెస్టో రీకాలింగ్ పేరిట అని చంద్రబాబు మోసాన్ని ఎండగడుతున్నాం అని ఆమె అన్నారు.శుక్రవారం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. ‘‘నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు చెపుతున్నారు. విజన్ ఉంది.. విస్తరాకుల కట్ట ఉంది అని చెప్పి.. స్కాంలలో విజనరీగా చెలామణి అవుతున్నారు. పేద పిల్లల చదువుకు చంద్రబాబు మోకాలు అడ్డు పెడుతున్నారు. పేదవాడిని మద్యం మత్తులో ఉంచి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రతీది కల్తీనే. చివరకు బడి పిల్లకు కూడా కల్తీ భోజనం పెడుతున్నారు.ఏపీలో మూడు కోతుల్లా బొమ్మల్లా.. కూటమి నాయకులు ముగ్గురు ఉన్నారు. దృతరాష్ట్ర పాలనతో చంద్రబాబు కళ్లు మూసుకున్నారు. విద్యార్దుల జీవితాలు నాశనం అవుతుంటే లోకేష్ చెవులు మూసుకొన్నారు. పవర్ లేని పవన్ కల్యాణ్ ఈ తండ్రీకొడుకుల అరాచకాలను ప్రశ్నించకుండా నోరు మూసుకుని కూర్చున్నారు. పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకి లేదు. అదే ఉండి ఉంటే.. 2019కి ముందే ఆయన ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి ఉండేవారు. విద్యాశాఖమంత్రి అంటే ఎలా ఉండాలో ఆదిమూలపు సురేష్‌ని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో నారా లోకేష్‌ని చూసి తెలుసుకోవాలి. 2019-2024 జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి ఇస్తే.. ఇప్పుడు దానిని సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకున్నారు. చంద్రబాబు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల పేర్లు మార్చుకొని చంద్రబాబు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యే లు ఇంటింటికి తిరిగే దమ్ము ఉందా? అని రోజా ప్రశ్నించారు.పోలీసులు ఉన్నది అధికార పార్టీకి ఊడిగం చెయ్యడం కోసం కాదు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల ప్రాణాల కోసం పని చెయ్యాలి. ఆంక్షలు పెడితే భయపడటానికి ఇక్కడ ఉన్నది లోకేష్ కార్యకర్తలు కాదు... జగన్ అనే సింహం కార్యకర్తలు. ఈవీఎంలతో గెలిచి ఎగిరెగిరి పడితే జనం ఎగరేసి కొడతారు జాగ్రత్త’’ అని కూటమి నేతలను ఉద్దేశించి రోజా అన్నారు. -
పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయమా?.. ఇక్కడుంది జగన్
చంద్రబాబు నాయుడు గ్యారెంటీకి పవన్ కల్యాణ్ ష్యూరిటీ అన్నారు. కానీ, చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే!. అందుకే ఆయన ఇంటిపేరు నారా కాదు.. మోసం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సాక్షి, విజయవాడ: చంద్రబాబు మోసాలను ఎండగడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమం బుధవారం విజయవాడలో జరిగింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ‘‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’’ సమావేశంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు పాల్గొని ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి హయాంలో డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోనే నగదు జమ అయ్యేది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఫెయిల్యూర్ అయ్యింది. జగన్ పర్యటనలకు రాకుండా పోలీసులు అడ్డుపడినా ప్రజలు ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం బుడమేరు ముంపు గ్రామాలకు న్యాయం చేయలేకపోయింది. మాజీమంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు అంటేనే మోసం.. ఆయన జీవితమే మోసం. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. అందుకే ఆయన ఇంటిపేరు నారా కాదు.. మోసం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎప్పుడైనా అమ్మ ఒడి గురించి ఆలోచించారా?. చంద్రబాబుకు మాత్రం ఒక్కడే కొడుకు...కానీ ప్రజలను మాత్రం ఇద్దర్ని కనమంటాడు. చంద్రబాబు నాయుడు గ్యారెంటీకి పవన్ కళ్యాణ్ ష్యూరిటీ అన్నారు. ఇప్పుడేమైంది?. ఏపీలో పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. సత్తెనపల్లిలో 113 మంది పై కేసులు పెట్టారు. ఏపీలో ఐపీఎస్ , ఐఏఎస్ అధికారులను జైలుకు పంపిస్తున్నారు. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే ఎవరూ భయపడరు .. పారిపోరు. ఎక్కడా తగ్గేదే లేదు సోనియాగాంధీ, చంద్రబాబులను ఎదిరించి జగన్ పార్టీ పెట్టారు. ఆయన చిరంజీవిలాగా పార్టీ పెట్టి పారిపోయిన వ్యక్తి కాదు. మీరు ఎంత తొక్కితే అంత పైకి వచ్చే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. వంగవీటి మోహనరంగా , వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు. రంగా అనుచరుడిగా ఉన్న మల్లాది విష్ణుకి వైఎస్సార్ ఎమ్మెల్యేగా సీటు ఇచ్చారు. మల్లాది విష్ణు మళ్లీ అసెంబ్లీలో తన కంఠాన్ని వినిపిస్తారు. విజయవాడ పార్లమెంట్ పరిశీలకులు, మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డిది అబద్దాలు చెప్పే మనస్తత్వం కాదు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచాడు... ప్రజలు ఓడిపోయారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని చూస్తే భారత రాజ్యాంగం గుర్తొస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూస్తే ఆరోగ్య శ్రీ గుర్తుకు వస్తుంది. ఎన్టీఆర్ ను చూస్తే రెండు రూపాయల కిలో బియ్యం గుర్తొస్తుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విగ్రహం పెట్టాలి...అప్పుడు మోసాలు దౌర్జన్యాలు గుర్తుకొస్తాయి. తెలుగుదేశం పార్టీ నేతలే ఇంత మెజార్టీని నమ్మలేకపోతున్నారు. అంబటి రాంబాబులాగా అందరూ ఉత్సాహంగా పనిచేయాలిడిప్యూటీ మేయర్ ,శైలజారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు తాండవిస్తుంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు.చంద్రబాబు కుటంబానికి మాత్రమే న్యాయం జరిగింది. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ మళ్లీ నిరూపించుకున్నారు. బ్రిటిష్ కాలం నాటి పాలన మళ్లీ మొదలైంది. విజయవాడ ధర్నా చౌక్ లో ప్రతి రోజూ ప్రభుత్వం పై ధర్నాలు జరుగుతున్నాయి. మెడికల్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. చంద్రబాబు కాన్వాయ్ వద్ద ప్రజలు ఎవరూ లేరు. జగన్ కాన్వాయ్ వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం దగ్గరపడింది. పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు మేక తోలు కప్పుకున్న పులి. పల్నాడులో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చంద్రబాబు హత్య చేయించారు. నాలుగు లక్షల మంది వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ కి దక్కింది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు , నాయకులు , కార్యకర్తలు హాజరయ్యారు. -
చంద్రబాబు వంద చెబితే.. లోకేష్ రెండొందలు చెబుతున్నాడు
సాక్షి, కాకినాడ: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు, రైతులు కచ్చింగా మోసపోతారని.. ఇలా మాయమాటలు చెప్పేవాళ్లను మోసగాళ్లు అనడంలో తప్పే లేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం వంగా గీత అధ్యక్షతన పిఠాపురంలో జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు అసలు సూపర్ సిక్స్ వాగ్ధానాలు ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయ్యరా?. అడిగితే మక్కెలు విగకొడతాం, తాట తీస్తాం అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అంటున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు తేరగా ఉన్నారా?. ఒక్కసారి గ్రామాల్లో తిరగండీ.. ఎవరికి మక్కెలు విరగకొడతారో తెలుస్తుంది.మాయమాటలు చెప్పేవాళ్ళను మోసగాళ్ళని అనలా? వద్దా?. కూటమి అధికారంలోకి వచ్చి ఒక్క ఉద్యోగం ఇచ్చిందా?. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు, రైతులు మోసపోతారు. చంద్రబాబు వంద అబద్దాలు చెబితే.. లోకేష్ రెండు వందల అబద్దాలు చెబుతారు. ఏప్రిల్.. మే మాసంలో రైతులు అన్నదాత సుఖీభవ ఇస్తామని లోకేష్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఇప్పుడు ఏ నెల నడుస్తుందో రైతులు,ప్రజలు గుర్తించాలి. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంతో ప్రజల్లోకి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు వెళ్ళాలి అని బొత్స పిలుపు ఇచ్చారు. పిఠాపురం వైఎస్సార్సీపీ ఇంఛార్జి వంగా గీతా మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాకు వెన్నంటే ఉన్నారు. ఏలేరు వరదల సమయంలో జగన్ వెంట జనం ఉన్నారు అని చూపించారు.దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక వీదికో రెండు బెల్టు షాపులు పెట్టారు. నాణ్యమైన గంజాయి వ్యాపారం చేసి యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారు. చంద్రబాబు మాటలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరు. చంద్రబాబు మాటలకు విలువలు..విశ్వసనీయత ఉండదు. అందుకే బాబు హమీలకు నాది భాధ్యత అని గత ఎన్నికల్లో పవన్ చెప్పారు. ఇద్దరు మాటలు విని రాష్ట్ర ప్రజలు మోసపోయారు. ధాన్యాగారంగా ఉన్న పిఠాపురంలో ఇప్పుడు రైతుల పరిస్థితి ఏమిటీ?. నాలుగు సార్లు ముఖ్యమంత్రి గా చేసిన చంద్రబాబు.. ఇప్పటి వరకు కుప్పాన్ని...స్వర్ణ కుప్పం ఎందుకు చేయ్యలేదు. సుపరిపాలనలో తొలి అడుగుకు టీడీపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు.జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అయిన తరువాత పిఠాపురం నియోజకవర్గం కు పవన్ ఎన్నిసార్లు వచ్చారు?. పిఠాపురం లో ప్రజల సమస్యల మీద ఒక్క క్షణం ఆలోచించే పరిస్ధితిలో లేరు. వాలంటీర్ల ద్వారా అదృశ్యమయ్యారని చెప్పిన పవన్.. మరి ఆ మహిళలను వెనక్కి తీసుకువచ్చారా?. కాపు సామాజిక వర్గంలో యువత పవన్ ను హీరోగా భావించి వెనుక తిరిగారు. వారంతా ఇప్పుడు తమను తాము ప్రశ్నించుకోవాలి. పవన్ ముఖ్యమంత్రి అవ్వడం కోసం పార్టీ పెట్టారా?. లేదంటే చంద్రబాబును ముఖ్యమంత్రి ని చేయ్యడానికి పార్టీని పెట్టారా? చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేయ్యాలని తాపత్రాయ పడే పవన్ ను హీరోగా చూడడం ఖర్మ.వంగవీటి మోహన రంగా , ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళను కాపులు హీరోలుగా చూడాలి. సినిమాలో నాలుగు స్టెప్పులు వేసి..బయటకు వచ్చి మైక్ పట్టుకున్న వ్యక్తిని హీరోగా చూడడం దౌర్భాగ్యం. రానున్న రోజుల్లో పవన్ కల్యాణ్‌కు, వంగా గీతా కు మధ్య ఉన్న వ్యత్యాసం పిఠాపురం ప్రజలకు కచ్చితంగా తెలుస్తుంది. రాజకీయంగా జన్మనిచ్చిన పిఠాపురం లో పవన్ అంతం అయ్యేలా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలి.తోట నరసింహం మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైఎస్ జగన్. దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా అనేక సంక్షేమ పధకాలు అమలు చేశారు. మేనిఫెస్టోను భగవత్ గీత,బైబిల్,ఖురాన్ గా ఆరాధించారు. మరో 15-20 ఏళ్ళు కూటమి కలిసే ఉంటుందని పవన్ అంటున్నారు. పిఠాపురం లోనే కూటమీకి బీటలు వారాయి. జెండాలతో.. కుర్చీలతో కూటమి నేతలు కొట్టుకుంటున్నారు. -
గిన్నిస్ బుక్‌లోని బాబు మోసాలు, దుర్మార్గాలు: సజ్జల
ప్రజలకు ఎన్నికల వేళ హామీలను ఎంత తేలికగా ఇచ్చారో.. వాటిని అంతే తేలికగా ఇప్పుడు చంద్రబాబు కొట్టేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందని.. అందుకే బాబు మెడలు వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారాయన. అశేష ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్‌పై సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం ఉండదని సజ్జల తేల్చేశారాయన. సాక్షి, అనంతపురం: అబద్దాలను ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబును మించినవారు లేరని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శింగనమల నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం.. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో(Recalling Chandrababu’s Manifesto) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను గుర్తుచేసేందుకే ఈ కార్యక్రమం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు... ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో, సూపర్ సిక్స్ హామీలు ఎలా అమలు చేయాలో చెవిలో చెప్పాలంటున్నారు!. హామీలను తేలికగా ఇచ్చినట్లే.. అంతే తేలికగా కొట్టిపారేస్తుంటారాయన. అందుకే ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న కుట్రలతో చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలందరినీ జైల్లో పెట్టాలన్నది చంద్రబాబు కోరిక. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసి.. బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అన్ని ఆధారాలతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశాం... జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మంచి చాలా ఉండేది. చంద్రబాబు దుర్మార్గాలను చెబుతూ పోతే వారం రోజులు పడుతుంది. చంద్రబాబు మోసాలు, దుర్మార్గాలను గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించొచ్చు. అబద్ధాలను ప్రచారంలో చంద్రబాబును మించినవారు లేరు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను ఎల్లో మాఫియా మింగేస్తోంది. కూటమి నేతలు ఇళ్లకు వస్తే నిలదీయడానికి.. చంద్రబాబు మెడలు వంచడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో రీకాల్ సిస్టం లేదు.. లేకపోతే చంద్రబాబు సర్కార్‌కు పదవీ గండం ఉండేది. .. హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. గడికోట శ్రీకాంత్ రెడ్డి పై ఎస్‌వోజీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం దారుణం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేందుకు, ఆయన్ని లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఆయనకు ఉన్న భద్రతను తొలగించింది. పేరుకే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత.. ఆచరణలో అమలు చేయడం లేదు. .. సింగయ్య మృతి కేసులో జగన్‌పై కేసు నమోదు.. దుర్మార్గానికి పరాకాష్ట. ఎన్ని బెదిరింపులు వచ్చినా సత్తెనపల్లి లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని చూసేందుకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్‌ను ఎంత అణచి వేయాలని చూస్తే... అంత ఎదుగుతారు. మంచి పనులు చేస్తే జనం ఆదరిస్తారన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. వైఎస్ జగన్‌కు మద్దతుగా లక్షల మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. .. హామీలను త్రికరణ శుద్ధి తో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇంటింటికీ వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. చంద్రబాబు మోసాలను ప్రజల్లో తీసుకెళ్లండి’’ అని సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. ఇంకా రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్ట్ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు మోసాలను వివరించారు. ‘‘టీడీపీ కూటమి గెలుపు పై ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల అక్రమాల ద్వారా గెలిచారని ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. చంద్రబాబు అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నేతలు భయపడరు. నారా లోకేష్ రెడ్ బుక్‌ను ఎడమ కాలితో తన్ని ఎదిరిస్తాం. ప్రజలకు అండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారు’’:::మాజీ మంత్రి శైలజానాథ్ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు?. దళిత, గిరిజన బాలికల పై అఘాయిత్యాలు జరిగితే పవన్‌కు పట్టదా?. :::మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్చంద్రబాబు మోసాలను ప్రజల్లో కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వెన్నుపోటు. అప్పుడు ఎన్టీఆర్ కు... ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే. నవరత్నాలను పకడ్బందీగా అమలు చేసి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ పోరాట ఫలితంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. :::వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. టీడీపీ కూటమి పై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. టీడీపీ ఓటమి ఖాయం అని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ప్రతి రోజూ జగన్ జపం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదు. రైతులను గాలికొదిలేసి... మద్యం వ్యాపారులకు మాత్రమే చంద్రబాబు గిట్టుబాటు ధరలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ అమరావతి లో ఖర్చు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. :::వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి -
YS Jagan: చంద్రబాబు మోసాలను క్యూఆర్ కోడ్ రూపంలో ఇంటింటికీ చేర్చాలి
-
ఇక ఇంటింటికీ బాబు మోసాలు.. ప్రారంభించిన వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల టైంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు. అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ పేరుతో ఐదువారాల పాటు బృహత్తర కార్యక్రమం జరపాలని ఆయన నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన క్యూ ఆర్ కోడ్‌ను ఆవిష్కరించిన ఆయన.. ఇంటింటికీ దాన్ని చేర్చేలా కార్యక్రమం ప్రారంభించారు. సాక్షి, గుంటూరు: బుధవారం తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సం అవుతోంది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత కనిపిస్తోందని అన్నారాయన. చంద్రబాబునాయుడు.. ఈ వ్యతిరేకత మధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్‌తో పాటు, అణిచివేత చూస్తున్నాం. రెడ్‌బుక్ పాలన చూస్తున్నాం. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోంది. మన 5 ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందించాం. పార్టీ చూడకుండా మంచి చేశాం. అదే ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది ఏమిటంటే, కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు కనిపిస్తున్నాయి.అన్ని వ్యవస్థలు విధ్వంసంమన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చూశాం. కానీ చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది.రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో.. ఉద్దేశమిదేఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతోంది. మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అనేది చెప్పాలి. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. చంద్రబాబు తానిచ్చిన హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నాడు. ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం ప్రారంభం. చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఏం చెప్పాడు? ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు? అన్నింటిపై గ్రామ గ్రామాన, తీసుకుపోయేదే ఈ కార్యక్రమం. దీని పేరు.. ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’(Recalling Chandrababus manifesto). అదే తెలుగులో.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’చంద్రబాబు హామీలు. బాండ్లుఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా. అంతకు మించి ఇస్తానన్నాడు. జగన్‌కన్నా ఎక్కువ చేస్తానన్నాడు. – ఆ మాటలు చెప్పడమే కాకుండా, ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలను పంపించి.. ఆ కుటుంబం వద్దనే వారు కూర్చుని, మిస్డ్ కాల్ ఇప్పించారు. దాంతో ఓటీపీ వచ్చింది. దాన్ని ఎంటర్ చేయగానే, ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత వస్తుంది? అన్న వివరాలతో బాండ్ వస్తుంది.దానిపై ఏమని ఉంటుంది అంటే..చంద్రబాబునాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంటూ ఆయన, పవన్‌కళ్యాణ్ ఇద్దరూ సంతకం చేశారు. ఇంకా ఏయే పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది.. అంటూ పథకాలు వివరించారు. తల్లికి వందనం కింద ఇంత, అన్నదాతా సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి.. ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్ నుంచే ఆ మొత్తం అందుతుంది.ప్రలోభాలు. పచ్చి మోసంఏపీ ప్రజలకు ఇలా బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, చంద్రబాబు అండ్ కో పచ్చి మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావిస్తున్నాం. అందుకే ప్రజలంతా డిమాండ్ చేయాలి. మాకు జూన్ 2024 నుంచి ఇస్తామన్నావు. కానీ ఇవ్వలేదు. మాకు ఇంత బాకీ ఉన్నావు. మరి ఈ ఏడాది ఎప్పుడిస్తున్నావు? అంటూ ప్రజలు చంద్రబాబును నిలదీయాలి. అడగాలి.ఇవన్నీ ఎగ్గొట్టారుఒకవైపు అన్ని పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు, మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్. ఆరు త్రైమాసికాలు పెండింగ్. అలా రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4200 కోట్లు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మరోవైపు వసతి దీవెన కింద ఏటా రూ.1100 చొప్పున రెండేళ్లకు రూ.2,200 కోట్లు. పెండింగ్. ఆరోగ్యశ్రీ. నెలకు రూ.300 కోట్లు. అలా ఏడాదికి రూ.3,600 కోట్లు బకాయిలు. దీంతో నిరుపేదలకు పథకంలో వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. చేయూత, ఆసరా.. ఇలా ఏ పథకం లేదు. వ్యవసాయం తిరోగమనం. ఎక్కడా పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేనే లేదు.ఐదు వారాల కార్యక్రమంవీటన్నింటి మధ్య.. మనం రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని 5 వారాలు చేద్దాం. తొలుత పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు. పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు. వీళ్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే, చంద్రబాబు మ్యానిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. ఆ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ. ఆ స్థాయి నాయకుల ప్రెస్కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.నాలుగో దశలో గ్రామస్థాయిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్వాల్వ్ చేయాలి.ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడే ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోతే.. దాన్నీ పూర్తి చేయాలి. 5 వారాల ఈ కార్యక్రమం జరిగే నాటికి గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి.చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే.. ప్రజాగళం. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ హామీలు వస్తాయి. అంతే కాకుండా చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి (పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది?. అలా 5 ఏళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్ పంపారు. కానీ ఒక్క రూపాయి కూడా అందలేదు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఫోటోలతో పాటు, వాటిపై పార్టీ నాయకుల సంతకాలు పెట్టి, ఇంటింటా పంచారు. అవన్నీ రెడీగా పెట్టుకొండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది నుంచి ఇంత బాకీ. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలి అనేది తెలియజేయాలి.ఇవే కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పారు? పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు?. తల్లికి వందనం మొదలు ఉచిత బస్సు వరకు అన్నీ నేను మాట్లాడిన మాటలు.. పక్కనే చంద్రబాబునాయుడివి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం ఉంటుంది.ప్రజలతో మమేకం కావాలిఏడాది గడిచింది. హానీమూన్ పీరియడ్ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం.ఇది రాక్షస రాజ్యం. అందుకే..ప్రజా సమస్యలపై మనం పోరాడాలి. వారితో మమేకం కావాలి. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజలకు సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. కాబట్టి, మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో మమేకం కావాలి. వారి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలి. కృషి చేయాలి.చివరగా.. ఈనెల 4న ‘వెన్నుపోటు దినం’ బాగా చేశారు. మీ అందరికీ నా అభినందనలు. మొన్నటి యువతపోరు చాలా చోట్ల బాగా జరిగింది. వారందరికీ కూడా నా అభినందనలు అని వైఎస్ జగన్ కేడర్‌ను ఉద్దేశించి అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు.