ఇక ఇంటింటికీ బాబు మోసాలు.. ప్రారంభించిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Starts Chandrababu Cheating QR Code Campaign Complete Details | Sakshi
Sakshi News home page

క్యూఆర్‌ కోడ్‌తో ఇక ఇంటింటికీ బాబు మోసాలు.. ప్రారంభించిన వైఎస్‌ జగన్‌

Jun 25 2025 3:30 PM | Updated on Jun 25 2025 5:19 PM

YS Jagan Starts Chandrababu Cheating QR Code Campaign Complete Details

వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల టైంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు. అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ.. ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో’.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ పేరుతో ఐదువారాల పాటు బృహత్తర కార్యక్రమం జరపాలని ఆయన నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన క్యూ ఆర్‌ కోడ్‌ను ఆవిష్కరించిన ఆయన.. ఇంటింటికీ దాన్ని చేర్చేలా కార్యక్రమం ప్రారంభించారు. 

సాక్షి, గుంటూరు: బుధవారం తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సం అవుతోంది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత కనిపిస్తోందని అన్నారాయన. 

చంద్రబాబునాయుడు.. ఈ వ్యతిరేకత మధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు రాష్ట్రంలో డైవర్షన్‌ పాలిటిక్స్‌తో పాటు, అణిచివేత చూస్తున్నాం. రెడ్‌బుక్‌ పాలన చూస్తున్నాం. గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోంది. మన 5 ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందించాం. పార్టీ చూడకుండా మంచి చేశాం. అదే ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది ఏమిటంటే, కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు కనిపిస్తున్నాయి.

అన్ని వ్యవస్థలు విధ్వంసం
మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్‌ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చూశాం. కానీ చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతుంది.

రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో.. ఉద్దేశమిదే
ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతోంది. మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అనేది చెప్పాలి. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. చంద్రబాబు తానిచ్చిన హామీల రిబ్బన్‌ కూడా కట్‌ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నాడు. ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం ప్రారంభం. చంద్రబాబు మ్యానిఫెస్టోలో ఏం చెప్పాడు? ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు? అన్నింటిపై గ్రామ గ్రామాన,  తీసుకుపోయేదే ఈ కార్యక్రమం. దీని పేరు.. ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో’(Recalling Chandrababus manifesto). అదే తెలుగులో.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’

చంద్రబాబు హామీలు. బాండ్లు
ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్‌ చేస్తున్నవే కాకుండా. అంతకు మించి ఇస్తానన్నాడు. జగన్‌కన్నా ఎక్కువ చేస్తానన్నాడు. – ఆ మాటలు చెప్పడమే కాకుండా, ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలను పంపించి.. ఆ కుటుంబం వద్దనే వారు కూర్చుని, మిస్డ్‌ కాల్‌ ఇప్పించారు. దాంతో ఓటీపీ వచ్చింది. దాన్ని ఎంటర్‌ చేయగానే, ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత వస్తుంది? అన్న వివరాలతో బాండ్‌ వస్తుంది.

చంద్రబాబు మోసాలను క్యూఆర్ కోడ్ రూపంలో ఇంటింటికీ చేర్చాలి

దానిపై ఏమని ఉంటుంది అంటే..
చంద్రబాబునాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంటూ ఆయన, పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ సంతకం చేశారు. ఇంకా ఏయే పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది.. అంటూ పథకాలు వివరించారు. తల్లికి వందనం కింద ఇంత, అన్నదాతా సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి.. ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్‌ నుంచే ఆ మొత్తం అందుతుంది.

ప్రలోభాలు. పచ్చి మోసం
ఏపీ ప్రజలకు ఇలా బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, చంద్రబాబు అండ్‌ కో పచ్చి మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావిస్తున్నాం.  అందుకే ప్రజలంతా డిమాండ్‌ చేయాలి. మాకు జూన్‌ 2024 నుంచి ఇస్తామన్నావు. కానీ ఇవ్వలేదు. మాకు ఇంత బాకీ ఉన్నావు. మరి ఈ ఏడాది ఎప్పుడిస్తున్నావు? అంటూ ప్రజలు చంద్రబాబును నిలదీయాలి. అడగాలి.

ఇవన్నీ ఎగ్గొట్టారు
ఒకవైపు అన్ని పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు, మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌. ఆరు త్రైమాసికాలు పెండింగ్‌. అలా రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4200 కోట్లు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మరోవైపు వసతి దీవెన కింద ఏటా రూ.1100 చొప్పున రెండేళ్లకు రూ.2,200 కోట్లు. పెండింగ్‌. ఆరోగ్యశ్రీ. నెలకు రూ.300 కోట్లు. అలా ఏడాదికి రూ.3,600 కోట్లు బకాయిలు. దీంతో నిరుపేదలకు పథకంలో వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. చేయూత, ఆసరా.. ఇలా ఏ పథకం లేదు. వ్యవసాయం తిరోగమనం. ఎక్కడా పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ లేనే లేదు.

ఐదు వారాల కార్యక్రమం
వీటన్నింటి మధ్య.. మనం రీకాలింగ్‌ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని 5 వారాలు చేద్దాం. తొలుత పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు. పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు. వీళ్లు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే, చంద్రబాబు మ్యానిఫెస్టో, బాండ్లు వస్తాయి. మరో బటన్‌ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. ఆ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.

రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్‌ కోడ్‌ ఆవిష్కరణ. ఆ స్థాయి నాయకుల ప్రెస్‌కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు.
నాలుగో దశలో గ్రామస్థాయిలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్‌వాల్వ్‌ చేయాలి.
ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడే ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోతే.. దాన్నీ పూర్తి చేయాలి. 5 వారాల ఈ కార్యక్రమం జరిగే నాటికి గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలి.

చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే.. ప్రజాగళం. సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలు వస్తాయి. అంతే కాకుండా చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి (పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది?. అలా 5 ఏళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్‌ పంపారు. కానీ ఒక్క రూపాయి కూడా అందలేదు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఫోటోలతో పాటు, వాటిపై పార్టీ నాయకుల సంతకాలు పెట్టి, ఇంటింటా పంచారు. అవన్నీ రెడీగా పెట్టుకొండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది నుంచి ఇంత బాకీ. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలి అనేది తెలియజేయాలి.

ఇవే కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పారు? పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు?. తల్లికి వందనం మొదలు ఉచిత బస్సు వరకు అన్నీ నేను మాట్లాడిన మాటలు.. పక్కనే చంద్రబాబునాయుడివి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం ఉంటుంది.

ప్రజలతో మమేకం కావాలి
ఏడాది గడిచింది. హానీమూన్‌ పీరియడ్‌ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం.

ఇది రాక్షస రాజ్యం. అందుకే..
ప్రజా సమస్యలపై మనం పోరాడాలి. వారితో మమేకం కావాలి. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజలకు సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. కాబట్టి, మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో మమేకం కావాలి. వారి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలి. కృషి చేయాలి.

చివరగా.. ఈనెల 4న ‘వెన్నుపోటు దినం’ బాగా చేశారు. మీ అందరికీ నా అభినందనలు. మొన్నటి యువతపోరు చాలా చోట్ల బాగా జరిగింది. వారందరికీ కూడా నా అభినందనలు అని వైఎస్‌ జగన్‌ కేడర్‌ను ఉద్దేశించి అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. 

కూటమి మోసాలు ఎండగట్టేందుకు YSRCP సరికొత్త ప్రోగ్రాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement