డాలర్ల పంట.. కలతే రైతు కంట | Aqua farmers suffer loss in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

డాలర్ల పంట.. కలతే రైతు కంట

Feb 24 2026 5:28 AM | Updated on Feb 24 2026 5:28 AM

Aqua farmers suffer loss in Andhra Pradesh

సంక్షోభంలో ఆక్వా రంగం

పెట్టుబడులు కూడా రాక నష్టాలు 

నాణ్యత లేని సీడ్, ఫీడ్‌ 

ప్రభుత్వం నుంచి అందని విద్యుత్‌ సబ్సిడీ

గళమెత్తుతున్న ఆక్వా రైతులు 

పశ్చిమ గోదావరి జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు 

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌  

డాలర్ల పంటగా రైతుల ఇంట సిరులు కురిపించిన ఆక్వా సాగు సంక్షోభంలో చిక్కుకుంది. ప్రభుత్వం నుంచి కరువైన ప్రోత్సాహం, వైరస్‌ల దాడి, సీడ్, ఫీడ్‌  ధరలకు రెక్కలు వెరసి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంతో పాటు ‘పశి్చమ’కు పెట్టింది పేరైన ఆక్వా పంట నిండా ఒడిదుడుకులతో సాగుతోంది. సమస్యల పరిష్కారం కోసం రైతులు ఉద్యమ బాట పట్టినా, పంట విరామం ప్రకటించినా కూటమి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.

భీమవరం (ప్రకాశం చౌక్‌): పశ్చిమగోదావరి జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో దాదాపు 10 వేల మంది రైతులు వనామీ రొయ్య సాగు చేస్తున్నారు. ఎకరాకు పంటకు సుమారు రూ.4.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. నాసిరకం సీడ్‌తో దిగుబడి తగ్గడం, మార్కెట్‌లో మే తలు, మందుల ధరలు పెరగడం, ప్రభుత్వం నుంచి విద్యుత్‌ సబ్సిడీ అందకపోవడంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. కొన్నిసార్లు రైతులు అప్పులపాలవుతున్న దుస్థితి.  

విద్యుత్‌ సబ్సిడీపై నిర్లక్ష్యం  
ఆక్వా రైతులకు చంద్రబాబు ప్రభుత్వం కనీసం విద్యుత్‌ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. ఎన్నికల్లో అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కనీసం విద్యుత్‌ సబ్సిడీ ఊసెత్తడం లేదు. దీనికితోడు సర్‌చార్జీల పేరుతో మరింత భారం మోపింది. ఉదాహరణకు.. ఆక్వా చెరువుకు 40 హెచ్‌పీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉంటే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు బిల్లు రాగా.. ప్రస్తుతం విద్యుత్‌ సబ్సిడీ లేకపోవడంతో చార్జీలు పెరిగి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు బిల్లులు వస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యుత్‌ యూనిట్‌ను రూ.1.50కు అందించేవారని, చంద్రబాబు ప్రభుత్వం అలానే సరఫరా చేయాలని మొరపెట్టుకుంటున్నారు.  

ధరల మోత 
ఆక్వా మేతల తయారీకి సంబంధించి ముడి సరుకుల ధరలు తగ్గినా మేత ధరలను మాత్రం కంపెనీలు తగ్గించడం లేదు. దీనికి తోడు టన్నుకు రూ.4 వేల వరకు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ధ రలను నియంత్రించాల్సిన కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.  

కలెక్టర్‌కు మొర 
ఏడాదిలో రెండుసార్లు ఆక్వా రైతులు తమ సమస్యలపై కలెక్టర్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. గతంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వినతిపత్రం అందజేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇటీవల మరోసారి జిల్లాలోని రై తులంతా భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని విన తిపత్రం అందించారు. ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే నెల రోజుల్లో తమ కార్యాచరణ రూ పొందించుకుని సమస్యలపై పోరాటానికి దిగు తామని ఆక్వా సంఘ నాయకులు తెలిపారు.

ఎన్నడూ లేని సంక్షోభం 
నేను 11 ఎకరాల్లో ఆక్వా సా గు చేస్తున్నాను. ఇటువంటి ఆక్వా సంక్షోభం ఎన్నడూ చూడలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం కనీ సం విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఇది ఇస్తే కొంతైనా కో లుకుంటాం. ఫీడ్‌ ధరల తగ్గించాలి గతంలో ముడిసరుకుల ధరలు తగ్గినా కిలోకు రూ.20 తగ్గించాల్సి ఉన్నా తగ్గించలేదు. ప్రస్తుతం ఫిష్‌ మీల్‌ ధర పెరిగిన నేపథ్యంలో మళ్లీ ధరలు పెంచడం అన్యాయం. –తంగెళ్లబాబు, ఆక్వా రైతు 
నాసిరకం సీడ్‌తో నష్టం 
నాణ్యత లేని సీడ్‌ వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఈహెచ్‌పీ ఉన్న తల్లి రొయ్యల నుంచి సీడ్‌ దిగుమతి కావడంతో ఎక్కువ నష్టం జరుగుతోంది. సీఏఏ అధికారి ద్వారా సరైన పర్యవేక్షణ లేకపోవడం కారణంగా కనిపిస్తోంది. ఆక్వా సాగు బాగుండాలంటే మంచి సీడ్‌ లభించాలి. ఆక్వా రైతులు సమస్యలపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని సాగుకు అన్నిరకాలుగా ప్రోత్సాహం అందించాలి.  –మరిడి వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు

రైతుల డిమాండ్లు 
ఆక్వా జోన్, నా–ఆక్వా జోన్‌ అనే భేదం లేకుండా అందరికీ షరతులు లేకుండా యూనిట్‌ వి ద్యుత్‌ను రూ.1.50కే సబ్సిడీపై అందించాలి.   
ఆక్వా ఫీడ్‌ ధరలను కంపెనీలు ఈనెల 4న టన్నుకు రూ.4 వేల మేరకు పెంచాయి. గతంలో ముడి సరుకుల ధరలు తగ్గినా మేత ధరలు కిలోకు రూ.20 తగ్గించలేదు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.   
అమెరికా సుంకాల పేరుతో రొయ్యల ధరలను కిలోకు రూ.70 వరకు తగ్గించారు. ఆ తర్వాత సుంకం తగ్గినా రొయ్యల ధరలను మాత్రం పెంచలేదు.  

ఫీడ్‌ ప్లాంట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు కలిసి సిండికేట్‌గా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవాలి.  
దేశంలో రొయ్యల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. దేశీయ మార్కెట్‌ బలోపేతం చేయాలి. 

 ప్రస్తుతం ఈహెచ్‌పీ ఉన్న తల్లి రొయ్యల నుంచి సీడ్‌ దిగుమతి కావడంతో రైతులు నష్టపోతున్నారు. సీఏఏ అధికారి ద్వారా సరైన పర్యవేక్షణ లేకపోవడం సమస్యను పెంచుతోంది. చెన్నై నుంచి రాష్ట్రానికి వచ్చే సీడ్‌పై కఠిన నియంత్రణ విధించాలి. 
 రైతులు, ఫీడ్‌ ప్లాంట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, హేచరీ యజమానులు అందరూ ప్రభుత్వ చట్టాలకు లోబడి పనిచేయాలి. ఈ మేరకు ప్ర­భుత్వం పారదర్శక వ్యవస్థను తీసుకురావాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement