క్యూఆర్ స్కాన్ ద్వారా బాబు మోసాలు బయటపెడతాం: వైఎస్సార్‌సీపీ | Ysrcp Wide Ranging Meeting In Kakinada | Sakshi
Sakshi News home page

క్యూఆర్ స్కాన్ ద్వారా బాబు మోసాలు బయటపెడతాం: వైఎస్సార్‌సీపీ

Jun 27 2025 1:23 PM | Updated on Jun 27 2025 6:49 PM

Ysrcp Wide Ranging Meeting In Kakinada

సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని.. హమీల గురించి అడిగితే తాట తీస్తామంటున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం.. ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తరాంధ్ర రిజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, పార్లమెంటు పరిశీలకులు సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, వంగా గీతా, దవులూరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

బొత్స మాట్లాడుతూ.. ‘‘నాలుక మందంతో కార్యక్రమాలు చేస్తే ప్రజల తరపున ఉద్యమిస్తాం. ఇదిగో చంద్రబాబు.. ఇదిగో పవన్ అంటూ మీ మ్యానిఫెస్టో.. బాండ్లను ప్రజలకు చూపిస్తాం. అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేశారని అడుగుదాం. టక్కుటమార విద్యలతో ప్రజల్ని మోసం చేస్తే కుదరదు. తాట తీస్తాం, తోకలు కట్ చేస్తాం అంటున్నారు.

..అక్రమ కేసులు పెట్టి.. చట్టాన్ని చేతిలో తీసుకుంటే వైఎస్సార్‌సీపీ పని అయిపోతుందని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. ఇది ప్రజాస్వామ్యం అని గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ప్రభుత్వం ఎంత డ్రామా ఆడింది. సింగయ్య ప్రమాదంపై ఒక ఎస్సీ రెండు సార్లు మాట్లాడటం రాజకీయాల్లో ఎప్పుడైనా చూశామా?’’ అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

కురసాల కన్నబాబుమాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ను ఓడించండం తన వల్ల కాదని చంద్రబాబు కూటమి కట్టాడు. అందమైన అబద్దాలను హమీలుగా ఇచ్చాడు. ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధమే గెలిచింది. ప్రజలు.. ప్రతిపక్షం నోరెత్తకుండా బెదిరింపు ధోరణితో కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది. అందుకే "బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ" పేరుతో వైఎస్సార్‌సీపీ ప్రజల్లోకి వెళ్తుంది.

..క్యూఆర్ కోడ్‌ను ఫోన్‌లో స్కాన్ చేస్తే టీడీపీ ప్రజాగళం పేరుతో మ్యానిఫెస్టో వస్తుంది. సూపర్ సిక్స్ ఉమ్మడి మ్యానిఫెస్టో వస్తుంది. మొట్టమెదటి సారిగా రైతులకు పెట్టుబడి సాయం అందించిన నాయకుడు వైఎస్ జగన్. దీనిని చంద్రబాబు కాపీ కొట్టారు. షణ్ముక వ్యూహం పేరుతో కూటమి పార్టీలు మరికొన్ని హమీలు ఇచ్చాయి. 50 ఏళ్లు నిండినా ఎస్సీ, బీసీలకు పెన్షన్ ఇస్తానని.. నోటికొచ్చిన హమీలను చంద్రబాబు ఇచ్చారు. ఇస్తానన్న సూపర్ సిక్స్‌ పథకాలే అమలు చేయడం లేదు. ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు అనేక ఎత్తుగడలు వేశాడు’’అని కన్నబాబు మండిపడ్డారు.

కూటమి ఎన్నికల హమీలను అమలు చేసేలా ప్రజలతో కలిసి పోరాడతాం: బొత్స

దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన షణ్ముక వ్యూహం హమీ అమలు చేయాలి. కుమారస్వామీ పేరు మీద విడుదల చేసిన మేనిఫెస్టోలో హమీలను అమలు చేయాలి. కాపులకు ఐదేళ్లలో రూ.15 వేలు కోట్లు ఇస్తానని పవన్ చెప్పారు. వైఎస్ జగన్ ఫైనాన్స్ ఇంజనీరింగ్ వల్ల ఖాజనా ఎప్పుడు నిండుగా ఉండేది. కాలర్ పట్టుకుని హమీలు అమలు చేయమని అడుగుతాం. చంద్రబాబు ఎన్నికల్లో 143 హామీలు ఇచ్చాడు. చంద్రబాబు చేసిన వంచనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’

Advertisement
 
Advertisement
Advertisement