
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: చంద్రబాబు ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును కాపాడేలా కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
కూటమి నాయకుల వ్యక్తిగత స్వార్థం కనిపిస్తోంది. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడడం లేదు. వైఎస్సార్‌సీపీని, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడం తప్ప ఇంకేమీ లేదు. విశాఖ ఉక్కుపై కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తాం. యూరియా బస్తాలు ఇవ్వలేని స్థితలో ప్రభుత్వం ఉంది. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టాల్సి వస్తే ముందుకు చంద్రబాబుపైనే కేసులు పెట్టాలి
రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. రైతులకు కేంద్రం సాయం తప్ప.. రాష్ట్రం ఇచ్చింది లేదు. ప్రజాప్రతినిధులు, వారి తాబేదారుల కబ్జాలు పెరిగిపోయాయి.14 నెలలుగా ఢిల్లీ వెల్లి ఏం సాధించారు?. విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడారు’అని ప్రశ్నించారు.
కాగా, ఈ నెల 25వ తేదీన వైఎస్ జగన్ రాజమండ్రి పర్యటన రద్దు అయ్యింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో వైఎస్ జగన్ ములాఖత్ వినాయకచవితి తర్వాత ఉంటుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు.
