
జానపద కళలతో కనువిందు చేస్తూ, కళా రూ పాలతో మైమరిపింపజేస్తూ, విచిత్ర వేషధారణల తో ఆకట్టుకుంటూ విజయనగర ఉత్సవ శోభాయా త్ర శోభాయమానంగా జరిగింది.

విజయనగర ఉత్సవాల ప్రారంభానికి సంకేతంగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం ఉదయం మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ర్యాలీలో స్వాగత శకటం, రోలర్ స్కేటర్స్ విన్యాసాలతో, పైడితల్లి అమ్మవారి కలశాలతో మహిళలు, తప్పెటగుళ్లు, థింసా నృత్యం, పులి వేషాలు, విచిత్ర వేషాలు, ఆగమ పండితుల బృందం, విజయనగ రం వైభవం, కేరళ వాయిద్యాలు, కర్ర సాము, అడుగుల బొమ్మలు, కొమ్మ కోయ డ్యాన్స్ తదితర బృందాలు అలరించాయి.


















