
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: కూటమి ప్రభుత్వంలోని నాయకుల అరాచకాల్ని ప్రశ్నించాలని వైఎస్సార్‌సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్న సమయంలో ప్రతిపక్షమే ప్రజల గొంతుగా మారుతుందదన్నారు.
‘కూటమి నాయకుల అరాచకాలను ప్రశ్నించాలి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనియంగా ఉంది. చంద్రబాబు వంద అబద్ధాలు చెపితే... లోకేష్ 200 అబద్ధాలు చెబుతున్నాడు. గతంలో స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని చెప్పిన లోకేష్ ఇప్పుడు అదే మీటర్లు పెట్టడం ఎంతవరకు సమంజసం. మా నాయకుడు ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం’ అని బొత్స తెలిపారు.
వైఎస్సార్‌సీపీ మండపేట కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. ‘చంద్రబాబుది ఏరు దాటక తెప్ప తగలేసే పద్దతి. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేకపోయారు. 1,80, వేల ఇళ్ళు పెడతామని చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టలేకపోయారు. చంద్రబాబు ఒక్క హామీ కూడా నిలబెట్టు కోకుండా ప్రజలను అన్ని రకాలుగా మోసం చేశారు.’ అని మండిపడ్డారు.