విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల అంధ్రప్రదేశ్ మారుస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు అప్పులే పరమావధిగా చేస్తున్నారని విమర్శించారు. ఇన్ని అప్పులు చేసినా ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా? అపి బొత్స ప్రశ్నించారు. ఈరో.జు(శనివారం, డిసెంబర్ 13వ తేదీ) విశాఖపట్నం నుంచి మీడియాతో బొత్స మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు 18 నెలల కాలంలో 2 లక్షల 66 వేల కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో చేసిన అప్పులకు లెక్కలు చెప్పాం. మరి కూటమి పాలనలో చంద్రబాబుేచేసిన అప్పులకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో చేసిన అప్పులతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, పోర్ట్‌లు, ఆర్బీకేలతో పాటు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశాం. చంద్రబాబు చేసిన అప్పులుపారదర్శకంగా ప్రజలకు వివరించాలి. చంద్రబాబు ఇన్ని అప్పులు చేసినా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు’ అని మండిపడ్డారు.
బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే..
- ఆరోగ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారింది
- చంద్రబాబు 18 నెలల కాలంలో రెండు లక్షలు 66 వేల కోట్లు అప్పు తెచ్చారు..
- వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో 3 లక్షల 44 కోట్లు అప్పు తెచ్చారు..
- డైరెక్టర్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా 2 లక్షల కోట్ల కు పైగా ఖర్చు చేశారు..
- చంద్రబాబు తెచ్చిన అప్పులకు లెక్క పత్రం లేదు..
- దేనికి ఖర్చు పెట్టారో తెలియదు..
- వైఎస్ జగన్ 10 లక్షలు 20 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని తప్పుడు ప్రచారం చేశారు..
- జగన్ తెచ్చిన అప్పులతో శ్రీలంకగా మారిపోతుందన్నారు..
- చెత్తనుండి సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు..
- కూటమి పాలనలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది.
- అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడి ఉంది..
- పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు..
- చేయి తడిపితే కానీ పనులు జరజని ఏపీలో పని జరగదు
- రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి నెలకొంది..
- జగన్ అప్పులు తెచ్చి 90% వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చారు
- చంద్రబాబు అప్పల గురించి పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్తున్నారు..
- ప్రభుత్వం చేస్తున్న అప్పులు రాష్ట్ర అభివృద్ధికి చేటు..


