సంక్రాంతికి ఊరెళ్లేవారికి రైల్వే శాఖ గుడ్‌ న్యూస్‌ | Special Trains: Sc Railway To Open Advance Booking For December 14 | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి ఊరెళ్లేవారికి రైల్వే శాఖ గుడ్‌ న్యూస్‌

Dec 13 2025 4:51 PM | Updated on Dec 13 2025 5:18 PM

Special Trains: Sc Railway To Open Advance Booking For December 14

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారికి భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రేపు(డిసెంబర్‌ 14, ఆదివారం) ఉదయం 8గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్‌ను ఓపెన్ చేయనుంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

2026 జనవరి నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా.. ఏపీలోని ఇతర ప్రాంతాలకు, అలాగే ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement