పట్టాలపైకి వరద నీరు.. పలు రైళ్లు ఆలస్యం, రద్దు | Cyclone Montha impact: Heavy rains halt trains as floodwater submerges Dornakal station | Sakshi
Sakshi News home page

పట్టాలపైకి వరద నీరు.. పలు రైళ్లు ఆలస్యం, రద్దు

Oct 29 2025 12:39 PM | Updated on Oct 29 2025 12:54 PM

Cyclone Montha Effect Trains Cancel And Delay

సాక్షి, డోర్నకల్‌: మోంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో కురుస్తున్న వర్షం కారణంగా రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. దీంతో, డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో పట్టాల పైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది.

పట్టాలపైన నీరు చేరడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, మహబూబాబాద్‌లో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లను అధికారులు నిలిపివేశారు. కొండపల్లిలో సాయినగర్​ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేశారు. అలాగే రాష్ట్రంలోని పలు స్టేషన్లలో 12 గూడ్స్​ రైళ్లు తుపాను ఎఫెక్ట్​ దాటికి నిలిచిపోయాయి. కాజీపేట-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

మరోవైపు.. వర్షాల కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇందులో 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా, మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఫలక్‌నామా, ఈస్ట్​ కోస్ట్​, గోదావరి, విశాఖ, నర్సాపూర్​ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు అయ్యాయి. వర్షాల కారణంగా పలుచోట్ల రైల్వేస్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి.

ఇదిలా ఉండగా.. రానున్న మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో సహా, హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement