సాక్షి, హైదరాబాద్: రామేశ్వరం కేఫ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మధ్యాహ్నం(డిసెంబర్ 13, శనివారం) రామేశ్వరం కేఫ్ రుచులను ఆస్వాదించారు. అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి అఖిలేష్ యాదవ్ తెలుసుకున్నారు. అఖిలేష్‌కు కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు దక్షిణాది రుచులను ఆస్వాదిస్తూనే.. పలు రాజకీయ, సమకాలీన అంశాలపై కాసేపు ముచ్చటించారు.


రామేశ్వరం కేఫ్ యజమాని శరత్.. ఇరువురు నేతలకు ఘన స్వాగతం పలికారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేష్ యాదవ్.. వాటి నాణ్యతను, రుచిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. రామేశ్వరం కేఫ్‌లో లంచ్ అనంతరం, అఖిలేష్ యాదవ్, కేటీఆర్ అక్కడి నుండి బయలుదేరి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు.


