breaking news
Golconda Express
-
పట్టాలపైకి వరద.. పలు రైళ్ల రద్దు
సాక్షి, డోర్నకల్: మోంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షం కారణంగా రైలు పట్టాలపైకి వరద నీరు చేరింది. దీంతో, డోర్నకల్ రైల్వేస్టేషన్లో పట్టాల పైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది.పట్టాలపైన నీరు చేరడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. డోర్నకల్ రైల్వేస్టేషన్లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, మహబూబాబాద్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లను అధికారులు నిలిపివేశారు. కొండపల్లిలో సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేశారు. అలాగే రాష్ట్రంలోని పలు స్టేషన్లలో 12 గూడ్స్ రైళ్లు తుపాను ఎఫెక్ట్ దాటికి నిలిచిపోయాయి. కాజీపేట-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు.. వర్షాల కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇందులో 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా, మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఫలక్నామా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు అయ్యాయి. వర్షాల కారణంగా పలుచోట్ల రైల్వేస్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి.Bulletin No.17 dt.29.10.25Due to Cyclone Montha effectCancellation of Trains:1) https://t.co/EMHwado7vJ. 22204 Secunderabad - Visakhapatnam Express is cancelled on 29/10/20252) Tr. No. 12703 Howrah - Secunderabad Falaknuma Express is cancelled on 30/10/2025— South Central Railway (@SCRailwayIndia) October 29, 2025ఇదిలా ఉండగా.. రానున్న మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో సహా, హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. HyderabadRains ALERT 2 ⚠️🌧️ STEADY MODERATE RAINS to continue in entire city for next 2-3hrs, thereafter STEADY LIGHT RAINS will continue till late evening in the cityGRADUAL REDUCTION IN RAINS EXPECTED IN HYDERABAD CITY FROM LATE EVENING AS CYCLONE MONTHA GRADUALLY MOVING UP— Telangana Weatherman (@balaji25_t) October 29, 2025 -
టికెట్లు జేబులో! బాబాయి రైల్లో!
తపాలా: దాదాపు 35 యేళ్ల క్రితం సంఘటన ఇది. అప్పుడు గుంటూరు నుంచి హైదరాబాద్‌కు రెండు రైళ్లు నడిచేవి. ఉదయం కృష్ణా, మధ్యాహ్నం గోల్కొండ. బీబీనగర్-నడికుడి రైలుమార్గం అప్పుడు లేదు. హైదరాబాద్ వెళ్లాలంటే బెజవాడ మీదుగా పోవాల్సిందే! ఒకసారి మా పిన్నిని, బాబాయిని గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఎక్కించటానికి గుంటూరు స్టేషన్‌కు వచ్చాం. టికెట్ కౌంటర్ దగ్గర బాగా రష్‌గా ఉంది. టికెట్ ఎలా తీసుకోవాలి? అని ఆలోచిస్తూ మా బాబాయి నిలబడ్డాడు. మా తమ్ముడు జయప్రసాద్ అభిమన్యుడిలా గుంపులోకి చొరబడి, ఐదు నిమిషాల్లో కొనుక్కుని వచ్చాడు విజయగర్వంతో. అంతలో ప్లాట్‌ఫారమ్ మీదకు ట్రైన్ వచ్చింది. మేం అన్ని సామాన్లు ఖాళీ కంపార్ట్మెంట్లో పెట్టి, ఇద్దరికీ కిటికీ పక్కన సీటు సంపాదించాం. మా శ్రమకు మెచ్చి చెరో పది రూపాయలు చేతిలో పెట్టాడు బాబాయి. ఆ రోజు ఆలస్యంగా రావటంతో త్వరగా బయలుదేరింది ట్రైన్. మేం వీడ్కోలు చెప్పి స్టేషన్ బయటకు వచ్చాం. మా తమ్ముడు జేబులో డబ్బులు పెట్టుకుంటూ, ‘‘అన్నా! టిక్కెట్లు నా దగ్గరే ఉన్నాయి. పిన్నీవాళ్లకు ఇవ్వలేదు’’ అంటూ ఏడుస్తూ చెప్పాడు. అది వర్షాకాలం. అప్పుడే జోరుగా వర్షం మొదలైంది. మా వద్ద ఉన్న ఆ ఇరవై రూపాయలతో స్కూటర్లో పెట్రోల్ పోయించుకుని, గోల్కొండ ఎక్స్‌ప్రెస్ విజయవాడ చేరేలోపు మేం స్పీడుగా రోడ్డుపై ప్రయాణించి, విజయవాడ చేరాం. అప్పుడే ట్రైన్ ప్లాట్‌ఫారమ్ మీదకు వచ్చింది. మేం పరుగుపరుగున కంపార్ట్మెంట్ దగ్గరకు పోయాం. మమ్మల్ని చూసి, ‘‘ఇదేమిటిరా. మీరు ఇక్కడికి వర్షంలో తడుచుకుంటూ ఎందుకు వచ్చారు?’’ అని ఆశ్చర్యపోయారు పిన్ని, బాబాయి. విషయం చెప్పి, టికెట్లు ఇచ్చి స్టేషన్ బయటకు వచ్చాం. అసలు సంగతేమిటంటే, మేం వారికి టికెట్లు ఇచ్చేవరకు వాళ్లకి ఈ సంగతే గుర్తురాలేదట! - జన్నాభట్ల నరసింహప్రసాద్ నాగారం, రంగారెడ్డి జిల్లా


