సాక్షి, మెదక్: పెద్దశంకరంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తుండగా ఘటన జరిగింది.
మృతుల్లో దంపతులు సహా కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతులను కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి చెందిన మృతులు లింగమయ్య, సాయమ్మ, మానస, సాయిగా గుర్తించారు.


