సాక్షి, హైదరాబాద్: శబరిమల వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. 60 శబరిమల ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. బుకింగ్స్ ఇవాళ (నవంబర్ 7, శుక్రవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. శబరిమల యాత్రికుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఈ యాత్రా సీజన్‌లో 60 ప్రత్యేక రైళ్లను నడపనుంది. యాత్రికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని, తమ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.
ఈ ప్రత్యేక రైళ్లు మచిలీపట్నం, నర్సాపురం, చర్లపల్లి నుంచి కొల్లం వరకు నడుస్తాయి. రేణిగుంట, గూడూరు, గుంటూరు మార్గాల మీదగా నడవనున్నాయి. ఈ సేవలు నవంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు అందుబాటులో ఉంటాయని ఎస్‌సీఆర్ ప్రకటించింది.
రైలు నంబర్ 07107: (చర్లపల్లి నుంచి కొల్లాం వరకు) నవంబర్ 17, 24.. డిసెంబర్ 1,8,15,22,29.. జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి బయలుదేరి.. మర్నాడు కొల్లాం చేరుకుంటాయి. పగిడిపల్లి, గుంటూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతాయి.
రైలు నంబర్ 07108: (కొల్లాం నుంచి చర్లపల్లి వరకు) నవంబర్ 19, 26.. డిసెంబర్ 3,10,17,24,31 తేదీల్లో.. జనవరి 7,14,21 తేదీల్లో కొల్లా నుంచి బయలుదేరి.. మర్నాడు చర్లపల్లి చేరుకుంటాయి.

SCR to run 60 #Sabarimala #SpecialTrains
Bookings for the Sabarimala Special Trains will be open tomorrow morning i.e., 07/11/2025 @ 08.00 hrs pic.twitter.com/U1xbjxkRPa— South Central Railway (@SCRailwayIndia) November 6, 2025


