మంత్రి పార్థసారథి ఇలాకాలో జోరుగా పేకాట | police raid on mango bay recreation club gambling | Sakshi
Sakshi News home page

మంత్రి పార్థసారథి ఇలాకాలో జోరుగా పేకాట

Dec 22 2025 10:18 AM | Updated on Dec 22 2025 1:06 PM

police raid on mango bay recreation club gambling

ఏలూరు జిల్లా: మంత్రి పార్థసారథి ఇలాకాలో జోరుగా పేకాట జరుగుతుంది.  ఆగిరిపల్లి మండలంలోని పోతవరప్పాడు శివారులో ఉన్న మ్యాంగో రిక్రియేషన్‌ క్లబ్‌లో యథేచ్ఛగా జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఆదివారం డీఎస్పీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి సైతం ఇక్కడకు పేకాట రాయుళ్లు భారీగా తరలి వచ్చారు.

రిక్రియేషన్ క్లబ్‌లో 13 ముక్కల పేకాట జోరుగా సాగుతోందని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడుల సమయంలో 120 మందికి పైగా పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. క్లబ్ ప్రాంగణం మొత్తం పేకాటగాళ్లతో నిండిపోయినట్లు తెలుస్తోంది.

దాడుల్లో భాగంగా పోలీసులు రూ.18 లక్షల నగదు, 120 కార్లు, 50 బైకులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పేకాటలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారేనని సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా, వారి వివరాలు నమోదు చేసుకుని పంపించేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అలాగే, పేకాట ఆడేందుకు తెలంగాణ నుంచి కూడా పలువురు వచ్చారని పోలీసులు గుర్తించారు. రిక్రియేషన్ క్లబ్ పేరుతో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు  
 

 

Advertisement
 
Advertisement
Advertisement