
సాక్షి, విజయనగరం: శ్రీపైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బొత్స సత్యనారాయణ కుటుంబం కూర్చున్న వేదిక కుంగిపోయింది. ఉద్దేశపూర్వకంగా డీసీసీబీ వేదికను టీడీపీ నేతలు రద్దు చేశారు. 30 ఏళ్లుగా సిరిమానోత్సవం వీక్షిస్తున్న ప్రాంతానికి బొత్స కుటుంబాన్ని టీడీపీ నేతలు అనుమతించలేదు. అర్బన్ బ్యాంక్ ప్రాంగణంలో కూర్చోవాలంటూ ఆదేశించారు. సిరిమాను రథం తిరగకముందే వేదిక కుంగిపోయింది. కుంగిపోయిన వేదిక నుంచే ఉత్సవాన్ని బొత్స కుటుంబం వీక్షించారు. టీడీపీ దిగజారుడు రాజకీయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


