
విజయవాడ: ఏపీ శాసనమండలి సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోరుతూ వైఎస్సార్‌సీపీ ప్రత్యేక తీర్మానం ప్రవేశ పెట్టింది. విపక్షనేత బొత్స సత్యనారాయణ సభలో ఈ తీర్మానం పెట్టారు. విశాఖలో స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడులు ఉప సంహరణ వెనక్కి తీసుకోవాలని, అదే సమయంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని కోరుతూ తీర్మానం పెట్టారు. దీనికి అన్ని పక్షాల సభ్యులు మద్దతు ఇవ్వాలని బొత్స సత్యనారాయణ కోరారు.
దీనిలో భాగంగా బొత్స ప్రసంగిస్తూ.. ‘స్టీల్ ప్లాంట్ అందరికీ సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఇండస్ట్రీస్ మేం అభివృద్ధి చేశామని టీడీపీ చెప్తుంది. పారిశ్రామిక రంగం విచ్చిన్నమైంది.. మేమొచ్చి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పారు. గత ఐదేళ్లలో జీడీపీ పెరిగింది తప్ప ఎక్కడా తగ్గలేదు. మా ప్రభుత్వ హయాంలో దేశంలో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూశారు. విశాఖలో 2023లో జరిగిన సమ్మిట్‌కి ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామికవేత్తలు వచ్చారు..
ప్రభుత్వ విధానాలు నచ్చి నవీన్ జిందాల్ వంటి వారు వచ్చారు.13 లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు చేసుకున్నాం. పరిశ్రమలు రావాలంటే వాళ్లకు నమ్మకం ఉండాలి. పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వానికి కో ఆర్డినేషన్ జరగటం నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే చూస్తాయి. గత మా సెకీ ఒప్పందాలపై నానా రాద్ధాంతం చేశారు.
ఆ తర్వాత ఏమైంది. విశాఖను ఫార్మా హబ్‌లా తీర్చిదిద్దాం. మాట్లాడితే హైదరాబాద్‌లో హైటెక్ సిటీ కట్టాం అని చెప్పుకుంటారు. గత ఐదేళ్లలో విశాఖలో ఐటీ కంపెనీలు సహా అనేక కంపెనీలు తెచ్చాం. ఇవాళ వాళ్ళు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో అవన్నీ మా హయాంలో మేం శంకుస్థాపనలు చేసినవే. లులూ కంపెనీ ఐదు మాల్స్ మూతపడ్డాయి.. అసలు దాని వర్త్ ఎంత..దాని క్రెడిబిలిటీ ఏంటి?, విజయవాడ ఆర్టీసీ స్థలం వాళ్లకు ఇవ్వటం ఏంటి?, ఆక్షన్‌లో పెట్టకుండా నేరుగా ఎందుకు ఇచ్చి వేస్తున్నారు’ అని ప్రశ్నల వర్షం కురిపించారు బొత్స.
స్టీల్‌ప్లాంట్‌పై పై బట్టబయలైన టీడీపీ ద్వంద్వ నాటకం
విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంపై టీడీపీ ద్వంద్వ వైఖరి మండలి సాక్షిగా బట్టబయలైంది. వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన తీర్మానానికి మంత్రి నారా లోకేష్ మద్దతు ఇవ్వలేదు. స్టీల్‌ప్లాంట్ పెట్టుబడులు ఉప సంహరణ వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తీర్మానం ప్రవేశపెట్టగా, దానికి కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్సీల మద్దతు కోరారు బొత్స. తాము ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ పెట్టాలని బొత్స కోరారు. దీనికి కూటమి పార్టీలు మద్దతు ఇవ్వలేదు.
ఇదీ చదవండి:
మండలిలో మంత్రి లోకేష్‌ను ఏకిపారేసిన బొత్స