ఓటేసిన వారిని కాటేస్తారా?: వైఎస్సార్‌సీపీ | Botsa Satyanarayana Fires On Chandrababu Government Over Illegal Cases On YCP Leaders | Sakshi
Sakshi News home page

ఓటేసిన వారిని కాటేస్తారా?: వైఎస్సార్‌సీపీ

Jul 5 2025 3:12 PM | Updated on Jul 5 2025 3:41 PM

Botsa Satyanarayana Fires On Chandrababu Government

సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రీజనల్ కో-ఆర్డినేటర్ కురుసాల కన్నబాబు. అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రులు పాముల పుష్పా శ్రీవాణి, పీడిక రాజన్న దొర,  ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి హాజరయ్యారు.

ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి అధికార పక్షం రెండోది ప్రతి పక్షం, ప్రతి పక్షం బాధ్యత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై గొంతుగా నిలవడం. ఇచ్చిన హామీలపై నిలదీయడం ప్రతి పక్షం బాద్యత. అమలు కానీ హామీలపై అడిగితే కేసులు పెట్టడం, నలకమందం అనడం సంప్రదాయం కాదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఇద్దరు హామీలు ఇచ్చారు. నెలలు గడుస్తున్నాయి. ఆ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.

40 శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజలు తరపున అడిగే హక్కు ఉంది. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిలో ఈ మోసాలపై నిలదీస్తాం. ఏడాది పాలనలో ఉద్యోగాలు తీసి.. నిరుద్యోగ భృతి మాట లేకుండా చేశారు. ఈ ఏడాది నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి రూ.36 వేలు ఎప్పుడు ఇస్తారు?. మా ప్రభుత్వంలో హామీల  అమలు కోసం మేనిఫెస్టోను జేబులో పెట్టుకుని తిరిగితే.. కుటమి నాయకులు అమలు చేయలేక వారి మేనిఫెస్టోను బిరువాలో పెట్టారు.’’ అంటూ బొత్స దుయ్యబట్టారు.

‘‘పువ్వు పుట్టిగానే పరిమళించినట్లు లోకేష్ మంత్రి అయ్యారు. తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ‘‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’’ అన్నట్లు  ఉంది. ఏడాది పుర్తి అయినా కేంద్రం ఇచ్చిన సాయం తప్ప రాష్ట్ర హామీ ఏమైంది?. సభ సాక్షిగా మే నెలలో ఇస్తామని చెప్పిన మంత్రి లోకేష్ ఏ మే నెలలో ఇస్తారో చెప్పాలి. వైద్య విద్యార్థులపై ఆడ పిల్లలు, చిన్న పిల్లలు అని చూడకుండా లాఠీఛార్జ్‌ చేయడం ప్రభుత్వ ధర్మం కాదు. ఏమి చేసిన అడిగే వారే లేరని వ్యవహరించడం సరికాదు. మనిషికి ఉన్న ఆశపైనే మోసపురిత రాజకీయాలు చంద్రబాబు చేస్తారు.

..చంద్రబాబు ఎప్పుడూ రైతులు, మహిళాలనే మోసం చేసి ముఖ్యమంత్రి అవుతున్నారు. రాష్ట్రంలో రైతులకు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. సరైన గిట్టుబాటు ధర కల్పించే బాద్యత ప్రభుత్వనిదే. వాటిపై మాట్లాడితే కేసులు పెట్టి తాట తీస్తామని వ్యాఖ్యలు చేస్తారా?. ఉపాధి హామీలో ఎప్పుడైనా మూడు నెలల బకాయిలు చెల్లించకుండా ఉంచారా?. రెక్క ఆడితే కానీ డొక్కా ఆడాని వారిని ఇబ్బందులకు గురి చేస్తారా?. మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు’’ అంటూ బొత్స నిలదీశారు.

కూటమి సర్కార్‌ నయ వంచన: కన్నబాబు
మాజీ మంత్రి కురుసాల కన్నబాబు మాట్లాడుతూ.. మోసపోయింది ప్రజలు తప్ప.. చంద్రబాబు కాదు. ఓటేసిన వాడిని కాటేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబే.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పథకాలు కాపీ కొట్టి.. పక్క రాష్ట్రాల్లో కొన్ని కాపీ కొట్టి నయవంచన చేశారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చేతులెత్తేసిన ఘనత చంద్రబాబుది. ఎన్నికల సమయంలో హామీలు అమలు చేస్తామని బాండ్లపై సంతకాలు చేసిన హామీ ఏమయింది?. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్య పరచాలి.

ఏడాది పాలనలో ఏవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేదో ప్రజలకు వివరించాలి. సంక్షేమ పథకాలు అమలు చేసామని చెప్పిన చంద్రబాబును ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎన్నికల్లో ప్రజల్లో మోసం చేసే గెలిచిన నాయకుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డులు సాధిస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో బాబు ష్యూరిటీ అని చంద్రబాబు ప్రమాణం చేశారు. తల్లి వందనం కార్యక్రమంలో సర్పంచ్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి పథకం రాకుండా చేశారు. రాష్ట్రంలో లక్షలాది మహిళాలకు తల్లికి వందనం రాలేదు అన్నది నిజం.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు ఆడి అధికారం దక్కించుకున్నారు. గతంలో కూడా ఆనాడు చంద్రబాబు 89 వేల కోట్లు రుణ మాఫీ చేయ్యల్సి వస్తే 15వేల కోట్లు మాత్రమే రుణ మాఫీ చేశారు. మీరు కనబడితే తొలి అడుగు కాదు తొలిసారిగా మిమ్మల్ని నిలదీస్తారు ప్రజలు. మా ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమన్ని  నేరుగా ఇంటికి వెళ్లి తెలియజేశాం. మీరు చేసిన ప్రతి అరాచకాన్ని 2.0 లో ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు’’ అని కన్నబాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement