
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయిందని, మరి సూపర్ సిక్స్ హామీలు ఏమైపోయాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో ‘ చంద్రబాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ నర్సాపురం పార్లమెంట్ పరిశీలకు మురళీ కృష్ణంరాజు, కన్వీనర్ ఉమాబాల, జిల్లా అధ్యక్షుడు ముదునూరు ప్రసాద్ రాజు, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావులు పాల్గొన్నారు.
దీనిలో భాగంగా బొత్స మాట్లాడుతూ.. ‘మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం గా భావించిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. ‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాండ్లు రాసి పేద ప్రజలను మోసం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంవత్సరం దాటిపోయింది మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమైపోయాయి..?, సూపర్ సిక్స్ హామీలు.. అన్ని ఇచ్చేసాను ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ నాలుక మందం అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తాటతీస్తాను మధ్యలో ఇరగ కొడతా అంటున్నాడు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు దగా కోరులు మోసగాళ్లు.. పేద ప్రజల పక్షాన ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూటమినేతల మెడలు వంచుతాం. చంద్రబాబు పాలన ఎప్పుడు వచ్చినా మహిళలు రైతులు నష్టపోతు ఉంటారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రండి గ్రామాల్లోకి వెళదాం... ఎవరి తాటతీస్తారో తేలిపోతుంది. చంద్రబాబు వచ్చి 100 అబద్ధాలు చెబుతాడు..లోకేష్ వచ్చి... 200 అబద్ధాలు చెబుతాడు. అన్నదాత సుఖీభవ రూ. 20000 ఇస్తా అన్నారు సంవత్సరమైంది ఎవరికైనా ఇచ్చారా....?, ప్రజల సమస్యలపై పోరాడటం మా పార్టీ ధ్యేయం. రాష్ట్రంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా....?, సిండికేట్లుగా మారి ఆక్వా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ’ అని ధ్వజమెత్తారు బొత్స.
జగన్ 2.0 లో కార్యకర్త ఏది చెబితే అదే జరుగుతుంది
జగన్ 2.0 లో కార్యకర్త ఏది చెబితే అదే జరుగుతుందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. మన నాయకుడు మాటిస్తే మాట తప్పే పరిస్థితి లేదు.. తగ్గేదే లేదని ఈ సందర్భంగా తెలిపారు.
కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రజలందరిని వంచించి మోసం చేశాడు. సంపదల సృష్టి కరెంటు బిల్లులు పెన్షన్ అంటూ అబద్ధాలు చెప్పాడు. చంద్రబాబు దుర్మార్గమైన మనిషి. ఒక పెద్ద మనిషి ప్రశ్నిస్తాను అన్నాడు. కాపు నేస్తమా అమలు చేయడం లేదు. దానిపై ప్రశ్నించడం లేదుచంద్రబాబు సంపద సృష్టించడంలో నెంబర్ వన్ కాదు అప్పులు చేయడంలో నెంబర్ వన్. సంవత్సరం తిరగకుండానే రూ. 1,50,000 కోట్లు అప్పులు చేశాడు’ అని మండిపడ్డారు.