
సాక్షి,కాకినాడ: ఊగిపోయి మాట్లాడావు కదా.. ఇప్పుడు ఏమైంది నీ పౌరుషం పవన్ అని శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు. కాకినాడలో బొత్స మీడియాతో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకునేవారే లేకుండాపోయారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక బస్తా యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయం దండగ,లాభంలేదని చంద్రబాబు బుర్రలో ఉంది. చంద్రబాబు అధికారంలో ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూరియా ఎందుకు దొరుకుంతుంది? కూటమి అధికారంలో ఉన్న ఏపీలో యూరియా ఎందుకు దొరకడం లేదు. 9వ తేదీన రైతు సంఘాలతో కలిసి ఉద్యమిస్తాం. ఆర్డీవో ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇస్తాం.
32మంది బలిదానాలతో విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చింది. విశాఖ ఉక్కుపై ప్రజల్ని చైతన్య పరుస్తాం. విశాఖ ఉక్కుకోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. విశాఖ ఉక్కు గురించి సీఎం,డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడరు. పవన్ కల్యాణ్ ఉగిపోయి మాట్లాడావు కదా.. ఏమైందీ మీ పౌరుషం. ఎన్నికలకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్లు ఇప్పుడు ఏమయ్యారు. విశాఖ ఉక్కుపై ప్రభుత్వ భవిష్యత్తు కార్యచరణ ఏంటీ? పవన్.. మీరు ఉప్పు కారం తినడం లేదా?. ప్రధాని మోదీతో విశాఖ ఉక్కు గురించి చంద్రబాబు ఏం మాట్లాడారు. 15నెలల్లో కూటమి ప్రభుత్వం రూ.2లక్షల కోట్లు అప్పు చేసిందని’ వ్యాఖ్యానించారు.
